Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి అన్ని విధాలుగా లాభాలే

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి అన్ని విధాలుగా లాభాలే

by Anji

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 24.06.2022: మేషం

 

ఉద్యోగ జీవితం సాఫీగానే సాగుతుంది. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య ఒక‌టి ప‌రిష్కార‌మ‌వుతుంది. నిరుద్యోగులు ఓ శుభ‌వార్త వింటారు. త‌ల‌పెట్టిన ప‌నులు పూర్తి చేస్తారు. ద‌గ్గ‌రి బంధువు ఒక‌టి స‌హాయ‌ప‌డ‌తారు. బంధువ‌ర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక ప‌రిస్థితి మెరుగుగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్య‌క్తిగ‌తంగా ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది. కుటుంబ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది. మిత్రులు స‌హాయ స‌హ‌కారాలందిస్తారు.

Today rashi phalau in telugu: మిథునం

ఆర్థికంగా అభివృద్ధికి అవ‌కాశం ఉంది. ఉద్యోగ వాతావ‌ర‌ణం సానుకూలంగా ఉంటుంది. త‌ల‌పెట్టిన ప‌నులు ఎంతో శ్ర‌మ మీద పూర్త‌వుతాయి. ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంటుంది. పిల్ల‌లు పురోగ‌తి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఉద్యోగంలో బాధ్య‌త‌లు పెరుగుతాయి. ప్ర‌మోష‌న్‌కు అవ‌కాశం ఉంటుంది. ఇంటా బ‌య‌టా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. అద‌న‌పు సంపాద‌న కోసం ప్ర‌య‌త్నాలు చేస్తారు. వ్యాపారం నిల‌క‌డ‌గా సాగుతుంది. కొత్త ప‌రిచ‌యాల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఆరోగ్యం ప‌ర‌వాలేదు.

Today rashi phalau in telugu : సింహం

ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. అధికార లాభం ఉంది. ఆర్థిక స్థోమ‌త కొంత వ‌ర‌కు మెరుగుప‌డుతుంది. మిత్రుల సాయంతో వ్య‌క్తిగ‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. స్పెక్యులేష‌న్ కు దూరంగా ఉండండి. ఆదాయం పెంచుకునేందుకు ప్ర‌యత్నాలు చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

ఆశించిన విధంగా ఆదాయం పెరుగుతుంది. ఖ‌ర్చుల‌కు క‌ళ్లెం వేయాలి. నిరుద్యోగుల‌కు ఉద్యోగం ల‌భించే అవ‌కాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక ప‌రిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ వాతావ‌ర‌ణం ఆశాజ‌నకంగా ఉంటుంది. ఇత‌రుల‌కు వీలైనంత‌గా స‌హాయం చేస్తారు.

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగం మారాల‌నే ఆలోచ‌న క‌లుగుతుంది. ఆర్థికంగా ప‌ర్వాలేదు. రాద‌నుకున్న డ‌బ్బు చేతికి అందుతుంది. కుటుంబ ప‌రంగా కొద్దిగా ఒత్తిడి, చికాకులుంటాయి. ప్ర‌యాణాల‌ను వాయిదా వేయండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఉద్యోగంలో స‌హోద్యోగుల నుంచి స‌హాయ‌, స‌హ‌కారాలందుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ప‌లుకుబ‌డిగ‌ల వారితో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. బంధువుల‌తో మంచి పేరు తెచ్చుకుంటారు. ప్ర‌ధానంగా ఆర్థిక స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనుకోకుండా ఆర్థిక స‌మ‌స్య ఒక‌టి ప‌రిష్కార‌మ‌వుతుంది. పట్టుద‌ల‌తో కొన్ని ముఖ్య‌మైన ప‌నులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక ప‌రిస్థితి మెరుగుగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి ఓ శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఉద్యోగం మార‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ద‌న లాభం ఉంటుంది. వ్యాపార‌ప‌రంగా ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌నిపిస్తున్నాయి. కుటుంబంలో కొద్దిగా ప్ర‌శాంత‌త లోపిస్తుంది. ఊహించ‌ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం చాలా వ‌ర‌కు కుదుట‌ప‌డుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా లేదు. ఉద్యోగంలో మీ శ్ర‌మ‌కు త‌గ్గ ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంది. రాద‌నుకున్న డ‌బ్బు చేతికి అందుతుంది. అనుకున్న ప‌నులు మిత్రుల సాయంతో పూర్తి అవుతాయి. వైద్య ప‌ర‌మైన ఖ‌ర్చులు చికాగు క‌లిగిస్తాయి. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

ఉద్యోగంలో స‌హోద్యోగుల స‌హ‌కారంతో ల‌క్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంటుంది. ప‌ట్టుద‌ల‌తో కొన్ని ప‌నులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్య‌క్తిగ‌త స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది. స‌న్నిహితుల సాయంతో నిరుద్యోగుల‌కు ఉద్యోగం ల‌భిస్తుంది.

Visitors Are Also Reading