Telugu News » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అనుకున్న‌వ‌న్ని అనుకూలంగా ఉంటాయి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అనుకున్న‌వ‌న్ని అనుకూలంగా ఉంటాయి

by Anji

ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Ads

Today rashi phalau in telugu 23.06.2022: మేషం

 

వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో ప్రోత్సాహ‌క‌ర‌మైన ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో అనుకూల‌త ఉంటుంది.

Today rashi phalau in telugu: వృషభం 

మ‌ధ్య‌మ ఫ‌లితాలుంటాయి. ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫ‌లితాలు సొంత‌మ‌వుతాయి. గిట్ట‌నివారు త‌ప్పుదోవ ప‌ట్టిస్తారు. చిన్న చిన్న అంశాల‌ను పెద్ద‌వి చేసుకోవడం స‌రికాదు.

Today rashi phalau in telugu: మిథునం

మంచి కాలం అనుకున్న ప‌ని నెర‌వేరుతుంది. ముఖ్య విష‌యాల్లో పురోగ‌తి సాధిస్తారు. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ల‌క్ష్యాన్ని త్వ‌ర‌గా చేరుకుంటారు. ప్ర‌యాణంలో అశ్ర‌ద్ధ వద్దు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కాలం అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తుంది. గౌర‌వ స‌న్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలున్నాయి. మిత్ర‌జ‌న స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : సింహం

స‌మాజంలో పేరు ప్ర‌తిష్ట‌ల‌ను సంపాదిస్తారు. ఆత్మీయుల‌తో క‌లిసి మ‌రువ‌లేని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి. విష్ణు స‌హ‌స్ర‌నామం చ‌ద‌వాలి.

Today rashi phalau in telugu : కన్య

మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. అకార‌ణ క‌ల‌హ సూచ‌న‌, శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న శైలి మిమ్మ‌ల్ని బాదిస్తుంది. అధికారుల‌తో కాస్త అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం ఇది.

Today rashi phalau in telugu : తుల

ఆశించిన ఫ‌లితాలు ద‌క్కుతాయి. కాలాన్ని మంచి ప‌నుల కోసం ఉప‌యోగించుకోండి. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. చెడు పైకి మ‌న‌స్సు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శ్రేష్ట‌మైన కాలం న‌డుస్తుంది. ప్రారంభించిన ప‌నులు త్వ‌ర‌త్వ‌రగా పూర్తవుతాయి. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న ఓ ఫ‌లితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఆదాయానికి త‌గ్గ వ్య‌యం ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

మీమీ రంగాల్లో మీ శ్ర‌మ ఫ‌లిస్తుంది. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య అభిప్రాయ భేదాలు రావ‌చ్చు. ఓ సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తే మీ ల‌క్ష్యాలు నెర‌వేరుతాయి. ప్ర‌యాణ ఖ‌ర్చులు వృథా చేస్తారు. ఒక సంఘ‌ట‌న బాద క‌లిగిస్తుంది. ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో మీరు ఆశించిన ఫ‌లితాలు రావాలంటే ఎక్కువ‌గా శ్ర‌మించాలి.

Today rashi phalau in telugu : కుంభం

మంచి ప‌నులు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అనుకూల‌మైన నిర్ణ‌యాలు వెలువ‌డ‌తాయి. మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టాల‌నే చూసే శత్రువుల ఎత్తులు ఫ‌లించ‌వు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. ఆగ్ర‌హావేశాల‌కు పోవ‌ద్దు.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనప్ప‌టికీ ప‌ట్టుద‌ల‌తో పూర్తి చేస్తారు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్ట‌ని వారు మీ అభిప్రాయాల‌ను ప్ర‌భావితం చేస్తారు.


You may also like