Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప‌ట్టుద‌ల‌తో అనుకున్న‌ది సాధిస్తారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప‌ట్టుద‌ల‌తో అనుకున్న‌ది సాధిస్తారు

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం వేళ‌లో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 01.06.2022: మేషం

ఈ రాశి వారు అసాధార‌ణ‌మైన ప‌ట్టుద‌ల‌తో అనుకున్న‌ది సాధిస్తారు. ఆదాయ మార్గాల‌ను పెంచుకుంటారు. అదేవిధంగా కొత్త నైపుణ్యాన్ని కూడా సాధిస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో అల‌స‌ట చెంద‌కుండా చూసుకోవాలి. తోటి వారితో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం యోగా చేయాలి.

Today rashi phalau in telugu: మిథునం

శ‌రీర సౌఖ్యం ఉంటుంది. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు. కొన్ని విష‌యాల్లో ఊహించిన దాని కంటే ఎక్కువ ఫ‌లితాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ప్రారంభించిన ప‌నుల్లో ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మీ ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు ల‌బిస్తాయి. ఊహించిన విదంగా ఫ‌లితాల‌ను అందుకుంటారు. భ‌విష్య‌త్‌కు సంబంధించిన అన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన ప‌నులు త్వ‌ర‌గా పూర్త‌వుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బందు, మిత్రుల ఆద‌రాభిమానాలు ఉంటాయి. ఉల్లాస భ‌రిత‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రారంభించిన ప‌నులు విజ‌య‌వంత‌మ‌వుతాయి. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. మంచి స‌మ‌యం. ప్రారంభించిన ప‌నుల‌ను మీ బుద్ధిబ‌లంతో చ‌క్క‌గా పూర్తి చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : తుల

ప‌నిలో శ్ర‌మ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవ‌స‌రాలు పెరుగుతాయి. ఓ వార్త మ‌న‌శ్శాంతిని త‌గ్గిస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. మాన‌సికంగా ధృడంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

గ్ర‌హ‌బ‌లం ప‌రిపూర్ణంగా ఉంది. కొత్త ప‌నులు చేప‌డుతారు. మ‌న‌సౌఖ్యం ఉన్న‌ది. ఆర్థిక అంశాలు లాభిస్తాయి. ఉత్సాహంతో ముందుకు సాగి విజ‌య‌వంతమైన ఫ‌లితాల‌ను అందుకుంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

క‌ష్టానికి త‌గిన ఫ‌లితాలు సొంత‌మ‌వుతాయి. నూత‌న కార్య‌క్ర‌మాల‌ను కొన్నాళ్లు వాయిదా వేయ‌డం మంచిది. స్థాన చ‌ల‌న సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : కుంభం

ఆత్మీయుల స‌హ‌కారంతో అనుకున్న‌ది సాధిస్తారు. స్థిర‌మైన భ‌విష్య‌త్ కోసం ఆలోచ‌న‌లు చేస్తారు. మీ మీ రంగాల్లో మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు.

Today rashi phalau in telugu :  మీనం

ప‌రిపూర్ణ‌మైన ఆత్మ‌విశ్వాసంతో ప‌ని చేయాలి. అల‌స‌ట పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ‌తారు. ఇత‌రుల వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

 

Visitors Are Also Reading