Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అదృష్ట‌వంతులు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అదృష్ట‌వంతులు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 25.07.2022: మేషం

 

మ‌నోధైర్యంతోనే చేసే ప‌నులు వెంట‌నే సిద్ధిస్తాయి. ఇష్ట‌మైనా వారితో కాలాన్ని గ‌డుపుతారు. కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూత‌న వ‌స్తు ప్రాప్తి క‌ల‌దు.

Today rashi phalau in telugu: వృషభం 

కుటుంబ సౌఖ్యం క‌ల‌దు. మీదైనా రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంది. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అదిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. ఇత‌రుల వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

Today rashi phalau in telugu : కర్కాటకం

అనుకూల ఫ‌లితాలు క‌ల‌వు. కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు ఫ‌లిస్తాయి. స‌మ‌స్య‌గా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయ‌వ‌ద్దు. బంధువుల వ్య‌వ‌హారాల్లో అంటి ముట్ట‌న‌ట్టుగా ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

స్థిర‌మైన నిర్ణ‌యాల‌తో అనుకూల ఫ‌లితాల‌ను సాధిస్తారు. తోటివారి సాయ‌, స‌హ‌కారాలు ఉంటాయి. బంధువుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

మంచి ఫ‌లితాల‌ను పొందుతారు. మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటుంది. త‌ల‌పెట్టిన ప‌నిలో ఆత్మీయుల స‌హ‌కారం అందుతుంది. బంధువుల‌తో మేలు జ‌రుగుతుంది. ఆధ్యాత్మిక విష‌యాల్లో చురుకుగా ఉంటారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టే ప‌నుల్లో ఆప‌ద‌లు పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మ‌స్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ఫ‌లితాలు పొందుతారు. అయిన వారి వ‌ల్ల స‌మ‌స్య‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను అదుపు చేయండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

త‌ల‌పెట్టిన‌ కార్యాల‌ను మ‌నోధైర్యంతో పూర్తి చేస్తారు. తోటివారితో ఆనందంగా గ‌డుపుతారు. బంధుమిత్రుల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌డుతాయి. కీల‌క‌మైన చ‌ర్చ‌లు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

ముఖ్య విష‌యాల్లో ఓర్పుతో వ్య‌వ‌హ‌రిస్తారు. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది. గొప్ప‌వారితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. న‌లుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవ‌బ‌లం సంపూర్ణంగా ర‌క్షిస్తుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్ర‌ద్ధ చేయ‌కండి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం సిద్ధిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ మ‌నోబ‌లంతో ముందుకు సాగండి. అనుకూల ఫ‌లితాలు సిద్ధిస్తాయి. శ్ర‌మ పెరుగుతుంది. ఎవ్వ‌రితోనూ వాదోప‌వాదాలు చేయ‌రాదు.

Today rashi phalau in telugu : కుంభం

మంచి మ‌నస్సుతో చేసే ప్ర‌య‌త్నాలు స‌త్ఫ‌లితాల‌ను ఇస్తాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. సుఖ‌, సంతోషాల‌తో గ‌డుపుతారు. ఆర్థికంగా ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. వివాద‌స్ప‌ద వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu :  మీనం

అనుకూల స‌మ‌యం. తోటివారి స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి. మీ బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతారు. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Visitors Are Also Reading