Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 07.07.2022: మేషం

 

కాలం శుభ‌ప్ర‌దంగా గ‌డుస్తుంది. మాన‌సికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. చేప‌ట్టిన ప‌నులను ప్ర‌ణాళికబ‌ద్ధంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలుంటాయి. నూత‌న కార్య‌క్ర‌మాల‌ను కుటుంబ స‌భ్యుల అంగీకారం త‌రువాత ప్రారంభించండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభ‌వార్త వింటారు. శ‌త్రువులు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu: మిథునం

కార్య‌సిద్ది ఉంటుంది. దైవ‌బలంతో ఓ కార్య‌క్ర‌మం పూర్తి చేస్తారు. ప్రారంభించిన ప‌నుల‌ను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. క్ష‌మాగుణంతో ఉంటే మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

మ‌న‌స్సౌఖ్యం ఉంటుంది. ఒక వ్య‌వ‌హారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణ‌యాలు గొప్ప ఫ‌లితాన్ని ఇస్తాయి. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu : సింహం

మీ మీ రంగాల్లో ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగి అనుకూల‌త‌ను సాధిస్తారు. ముఖ్య‌విష‌యాల్లో అనుకూల‌మైన నిర్ణ‌యాలు వెలువ‌డుతాయి. అధికారుల‌కు అణిగిమ‌ణిగి ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది. మీరు చేయ‌ని పొర‌పాటుకు నింద‌పడాల్సి రావ‌చ్చు.

Today rashi phalau in telugu : కన్య

అదృష్ట‌వంతులు అవుతారు. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో మంచి ఫ‌లితాలుంటాయి. ఆర్థికంగా సానుకూలిస్తుంది. నూత‌న వ‌స్తువుల‌ను కొంటారు. కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఎలాంటి ప‌రిస్థితిలోనూ మ‌నోధైర్యాన్ని కోల్పోరు. ప్రారంభించ‌ని ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేస్తారు. కొన్ని కీల‌క‌మైన ప్ర‌ణాళిక‌లు వేసి వాటిని ప్రారంభం కూడా చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

కార్యానుకూల‌త క‌ల‌దు. కొత్త ప‌నుల‌ను ప్రారంభించ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు పూర్తి చేసి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు.

Today rashi phalau in telugu : ధనస్సు

ప్రారంభించిన ప‌నిలో సంతృప్తిక‌ర‌మైన ప‌లితాలు సాధిస్తారు. స‌మ‌యానికి సాయం చేసేవారు ఉన్నారు. కీల‌క వ్య‌వ‌హారాల్లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

తోటివారి స‌హ‌కారంతో చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొందుతారు. బుద్ధిబ‌లం బాగుండ‌డం వ‌ల్ల కొన్ని కీల‌క వ్య‌వ‌హారాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లుగుతారు. ఒక శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. మీ ప్ర‌తిష్ట‌కు మ‌చ్చ తెచ్చేందుకు కొంద‌రూ ప్ర‌య‌త్నిస్తారు.

Today rashi phalau in telugu : కుంభం

మీమీ రంగాల్లో అనుకున్న ఫ‌లితాలు సొంతం అవుతాయి. ఓ వార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌కండి.

Today rashi phalau in telugu :  మీనం

బంధు మిత్రుల‌ను క‌లుస్తారు. కొన్ని కీల‌క వ్య‌వ‌హారాల‌ను వారితో చ‌ర్చించి కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంటారు. తెలివితేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క‌మైన ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. కొన్ని చ‌ర్చ‌లు మీకు లాభిస్తాయి.

Visitors Are Also Reading