రాశిఫలాలు చదవడం మీ భవిష్యత్‌ను అంచనా వేయాడానికి సులభమమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Today rashi phalau in telugu : మేషం
Advertisement
ఉద్యోగానికి సంబంధించి మంచి కబురు అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధు మిత్రుల సహాయ, సహాకారాలు లభిస్తాయి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు రాణిస్తారు. నిరుద్యోగులకు చిరుద్యోగం లభిస్తుంది.
Today rashi phalau in telugu : వృషభం
ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉన్నది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సహచరులు, సన్నిహితులతో వాదనలకు దిగవద్దు. వ్యాపారులు పురోగతిని సాధిస్తారు.
Today rashi phalau in telugu : మిథునం
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం పర్వాలేదు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త, తలచిన పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అకాశముంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు శ్రమ మాత్రం తప్పదు.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పరవాలేదు. బంధువుల నుంచి సహాయం అందుతుంది. శుభకార్యం తలపెడతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు అనుకూలమైన సమయం.
Today rashi phalau in telugu : సింహం
ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పెళ్లి సంబంధం కుదరవచ్చు. సంతానం నుంచి శుభవార్త వింటారు. బంధువుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కొత్తవారు పరిచయం అవుతారు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు పరవా లేదు.
Today rashi phalau in telugu : కన్య
ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. బంధు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు మంచి లాభాలు అర్జిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. తిప్పలు ఎక్కువగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండండి. పరిచయాలు జరుగుతాయి.
Advertisement
Today rashi phalau in telugu : తుల
ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది. తలపెట్టిన ప్రతి పని ఆలస్యం అవుతుంటుంది. తిప్పలు ఎక్కువగా ఉంటాయి. బంధు మిత్రుల రాకపోకలుంటాయి. ఆదాయపరంగా వ్యాపారులకు అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. అనుకొని విధంగా డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి.
Today rashi phalau in telugu : ధనస్సు
ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అదనపు బాధ్యతలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆదాయం పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారులు, వృత్తి నిపుణులకు కాలం అనుకూలంగా ఉంది.
Today rashi phalau in telugu మకరం
తలచిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలకు సమయం బాగుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదముంది. వ్యాపారులకు శ్రమ ఎక్కువ అవుతుంది జాగ్రత్త.
Today rashi phalau in telugu : కుంభం
అనుకోకుండా చేతికి డబ్బు అందుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఉద్యోగం విషయంలో కొద్దిగా ఆందోళన చెందుతారు. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. నష్టపోతారు. భార్య, పిల్లలతో సరదాగా గడుపుతారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.
Today rashi phalau in telugu : మీనం
ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంది. ముఖ్యంగా స్వయం ఉపాధి వారికి సమయం అనుకూలంగా ఉంది. పిల్లల్లో ఒకరికీ దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.