Home » Today rasi phalalu in telugu : ఈరాశి వారి కోరికలు నెరవేరుతాయట.. ఈ రాశుల వాళ్ళు జాగ్రత్త

Today rasi phalalu in telugu : ఈరాశి వారి కోరికలు నెరవేరుతాయట.. ఈ రాశుల వాళ్ళు జాగ్రత్త

by Anji

ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అదృష్ట నక్షత్రాలు ఎలా ఉన్నాయో ఈ రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

rashulu-phalau - Telugu Bullet

Today rashi phalau in telugu : మేషం

Aries Zodiac Sign People Personality And Nature | मेष राशि में जन्म लेने  वाले लोगों में होती हैं ये खास बातें - Planet Prediction | नवभारत टाइम्स

ఈ రోజు ఈ రాశివారికి బంధువుల రాక ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. ప్రేమికులకు ఎడబాటు తప్పదు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం.

Today rashi phalau in telugu : వృషభం

mars transit benefits on zodiacs: ఈ నెల 22న వృషభంలో అంగారకుడు ఆగమనం.. ఆరు  రాశుల ప్రజలకు అనుకూలం - Samayam Telugu

ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక విషయాల్లో ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ శక్తిసామర్థ్యాలను ఎదుటివారు గుర్తిస్తారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి.

Today rashi phalau in telugu : మిథునం

ఈ రోజు ఈ రాశివారు వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఖర్చుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కష్ట సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఈ రోజు ఈ రాశివారు జూదాల్లో ధననష్టం, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోస్తులకు ప్రమోషన్లు, ప్రత్యేక ఇంక్రిమెంట్లు వంటి శుభఫలితాలుంటాయి. పెద్దల ఆహార వ్యవహారాలలో మెళుకువ అవసరం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

Today rashi phalau in telugu : క‌న్య

ఈ రోజు ఈ రాశివారు విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. కార్యసాధనలో జయం, వ్యవహారాల్లో అనుకూలతలుంటాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సాంఘిక, సేవా కార్యక్రమాల్లో స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. పందేలు, జూదాల వల్ల ఇరకాటంలో పడతారు.

Today rashi phalau in telugu : తుల

ఈ రోజు ఈ రాశివారు పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. మీ యత్నాల్లో స్వల్ప చికాకులు ఎదురైనా క్రమేణా పరిస్థితులు చక్కబడతాయి. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు రూపొందిస్తారు. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

ఈ రోజు ఈ రాశిలోని హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకులు కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమించండి. అనుకున్నది సాధిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల చిరు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

ఈ రోజు ఈ రాశిలోని స్త్రీల మాటకు కుటుంబంలోను, సంఘంలోను ఆమోదం లభిస్తుంది. గృహంలో ఏదైనా శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహార, వ్యవహరాలలో మెలకువ వహించండి. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. ఆసక్తికరమైన విషయాలు మీ దృష్టికి వస్తాయి.

Today rashi phalau in telugu మకరం

ఈ రోజు ఈ రాశివారు బంధువులకు శుభాకాంక్షలు అందజేస్తారు. గత విషయాలు జప్తికి రాగలవు. మీ పలుకుబడి, మంచితనం దుర్వినియోగం అయ్యే ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. పెద్దల ఆరోగ్యము కుదుటపడుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.

Today rashi phalau in telugu : కుంభం

ఈ రోజు ఈ రాశివారు మిత్రులను కలుసుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగవలసి ఉంటుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్య నుండి గట్టెక్కుతారు.

Today rashi phalau in telugu : మీనం

ఈ రోజు ఈ రాశివారు ఇతరులను మీ కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంచటం మంచిది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. మీ పనులు మందకొడిగా సాగుతాయి. సత్కాలం ఆసన్నమవుతోంది. మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపం దాల్చుతాయి. రుణ యత్నాల్లో అనుకూలత, పెద్దల సహకారం లభిస్తుంది.


You may also like