కొన్ని రాశుల వారికి ఇవాళ ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మరికొన్ని రాశుల వారికి పలు అంశాలపై ఇబ్బందులు ఎదరయ్యే అవకాశం ఉంది.
Advertisement
Today rashi phalau in telugu : మేషం
ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల సమయం.
Today rashi phalau in telugu : వృషభం
ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సానుకూల వాతావరణం నెలకొంది. వ్యాపారంలో కూడా శుభ ఫలితాలున్నాయి. ధనలాభం ఉంటుంది. భవిష్యత్‌కు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా వరకు రుణాలు తీరుస్తారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. కోర్టు కేసుల్లో నెగ్గుతారు.
Today rashi phalau in telugu : మిథునం
గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్పలితాలను ఇస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఊళ్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా శుభకార్యంలో పాల్గొంటారు.
Today rashi phalau in telugu : కర్కాటకం
గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్పలితాలు ఇస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది.
Today rashi phalau in telugu : సింహం
కొన్ని ముఖ్యమైన పనులను ఓపికగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగానే ఉంటుంది. కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహాకారాలు అందుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త.
Today rashi phalau in telugu : కన్య
ఉద్యోగంలో ఉత్సాహంతో పని చేస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. వృత్తుల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురికాకుండా సరైన నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహకారంలో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
Advertisement
Today rashi phalau in telugu : తుల
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. భవిష్యత్‌కు సంబంధించి అవసరమైన ప్రణాళికలను ఆలోచిస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
Today rashi phalau in telugu : వృశ్చికం
ప్రస్తుత ప్రయత్నాలను కొనసాగిస్తే విజయం సొంతం అవుతుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడటానికి నాంది పలుకుతారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపరంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంది.
Today rashi phalau in telugu : ధనస్సు
ధనలాభ సూచనలు ఉన్నాయి. అదృష్టయోగం ఉంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగంలో చక్కని అవకాశాలు కలిపి వస్తాయి. మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది. ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమికులు సరదాగా గడుపుతారు. విద్యార్థులకు చాలా బాగుంది.
Today rashi phalau in telugu మకరం
ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంపద పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Today rashi phalau in telugu : కుంభం
కాస్తంత అనుకూలమైన సమయం ఇది. పనులన్నీ పూర్తవుతాయి. అవరోధాలు, ఆటంకాలు తొలుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మిమ్మల్నీ చూసి అసూయపడేవారు ఉంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. ఆరోగ్యం కాపాడుకోవాలి. పని ఒత్తిడి ఉంటుంది.
Today rashi phalau in telugu : మీనం
Advertisement
సమయం అంతగా అనుకూలంగా లేదు. ప్రతి పనికి ఊహించని ఆటంకాలు ఎదురు అవుతాయి. ముఖ్యకార్యాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల సలహాయ సహకారాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది.