Telugu News » Blog » Today rasi phalalu in telugu : ఆ రాశి వారు బంధువుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు

Today rasi phalalu in telugu : ఆ రాశి వారు బంధువుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు

by Anji
Ads

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. ఇత‌రుల వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌డ‌మే మంచిది.

Today rashi phalau in telugu : వృషభం 

గ్ర‌హబ‌లం త‌క్కువ‌గా ఉంది. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లు త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరుగుతాయి. బంధువుల‌తో విబేదాలు వ‌స్తాయి. ఆవేశానికి గురికాకండి.

Today rashi phalau in telugu : మిథునం

మీ రంగాల్లో జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలి. ముఖ్య‌విష‌యాల్లో కుటుంబ స‌హ‌కారం ఉంటుంది. కీల‌క విష‌యాల‌ను కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకుంటే మంచిది.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

స్థిర‌మైన నిర్ణ‌యాల‌తో అనుకూల ఫ‌లితాల‌ను సాధిస్తారు. తోటివారి స‌హాయ స‌హ‌కారాలుంటాయి. బంధువుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

అనుకూల ఫ‌లితాలు క‌ల‌వు. కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు ఫ‌లిస్తాయి. స‌మ‌స్య‌గా అనిపించినా అంశాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు బంధువుల వ్య‌వ‌హారాల్లో అంటి ముట్ట‌న‌ట్టు ఉండాలి.

Today rashi phalau in telugu : క‌న్య

మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటుంది. ప్రారంభించిన ప‌నిలో ఆత్మీయుల స‌హ‌కారం అందుతుంది. బంధువుల‌తో మేలు జ‌రుగుతుంది. ఆధ్యాత్మిక విష‌యాల్లో చురుగ్గా పాల్గొంటారు.

Also Read :  రాక్ స్టార్ అని పిలవొద్దన్న తమన్…వీడియో వైరల్…!

Today rashi phalau in telugu : తుల

మీ ప్ర‌తిభ, ప‌ని తీరుకు అధికారులు లేదా పెద్ద‌ల ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల వ‌ల్ల ధ‌న‌వ్య‌యం క‌లుగుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

మ‌నోధైర్యంతో చేసే ప‌నులు వెంట‌నే సిద్ధిస్తాయి. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. ముఖ్య వ్య‌వ‌హారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూత‌న వస్తు ప్రాప్తి క‌ల‌దు.

Today rashi phalau in telugu : ధనస్సు

ప్ర‌య‌త్న బ‌లాన్ని బ‌ట్టి ఫ‌లిత‌ముంటుంది. ఆత్మ‌స్థైర్యంతో ముందుకు సాగండి. తిరుగులేని ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఒక‌టి, రెండు ఆటంకాలు ఎదురైనా పెద్ద‌గా ఇబ్బంది క‌లిగించ‌వు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu మకరం

విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు ఉత్సాహాన్ని క‌లిగించే విధంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : కుంభం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా తోటివారి స‌హ‌కారంతో అధిగ‌మిస్తారు. కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇతరుల‌కు మేలు చేయాల‌నే ఆలోచ‌న మిమ్మ‌ల్ని గొప్ప‌వారిని చేస్తుంది.

Today rashi phalau in telugu : మీనం

అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళికా బ‌ద్దంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. ఆర్థికంగా న‌ష్టం రాకుండా చూసుకోవాలి. బంధు, మిత్రుల‌తో వాగ్వాదాల‌కు దిగ‌వ‌ద్దు.

Also Read :  ఆగ‌స్టు 7న‌ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నా అంటున్న స‌మంత‌..!


You may also like