Telugu News » Blog » Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి టైం బాలేదు

Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి టైం బాలేదు

by Anji
Ads

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

Today rashi phalau in telugu : మేషం

ఆర్థికంగా ప్ర‌యోజ‌నాలు బాగుంటాయి. ప్ర‌స్తుతానికి స‌మ‌యం అనుకూలంగా ఉంటుంది. ఇంటా బ‌య‌ట శ్ర‌మ పెరుగుతుంది. మిత్రుల స‌హాయంతో కుటుంబ సమ‌స్య‌ల‌ను ప‌రిస్క‌రించుకుంటారు. ఉద్యోగంలో అంద‌రినీ క‌లుపుకుని వెళ్లితే.. మంచిది. వివాదాల‌కు కాస్తంత దూరంగా ఉండండి. హామీలుండొద్దు.

Today rashi phalau in telugu : వృషభం 

వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి పురోగ‌తి సాధిస్తారు. అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌ముంది. ఆదాయం, ఆరోగ్యం ప‌ర‌వాలేద‌నిపిస్తాయి. అద‌న‌పు ఆదాయ ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది. విలువైన వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి స‌హ‌కారం ల‌భిస్తుంది. స్పెక్యులేష‌న్ లాభించ‌దు.

Today rashi phalau in telugu : మిథునం

ఆర్థిక ప‌రిస్థితి బాగా మెరుగుప‌డుతుంది. ఉద్యోగావ‌కాశాలు మీ ముందుకు వ‌స్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగ‌తి ఉంటుంది. వివాహ‌నికి శుభ స‌మ‌యం ఇది. స‌మాజంలో గౌర‌వ పుర‌స్కారాలు ల‌భిస్తాయి. శ‌త్రువులు మిత్రుల‌వుతారు. శుభ‌వార్త‌లు వింటారు. విద్యార్థులు శ్ర‌మ ప‌డ‌క త‌ప్ప‌దు. ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ఉద్యోగంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవ‌కాశ‌ముంది. శ్ర‌మ‌కు త‌గ్గ ప్ర‌తిఫ‌లం అందుతుంది. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా కొన్ని ప‌నులు పూర్తి చేసుకుంటారు. ఆస్తి విలువ గాని, షేర్ల విలువ గాని పెద్ద‌గా పెర‌గ‌దు. బంధు మిత్రుల స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి.

Today rashi phalau in telugu : సింహం

ఉద్యోగంలో సానుకూల వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. శ‌క్తికి మించి శ్ర‌మ ప‌డి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారంలో లాభాల‌కు అవ‌కాశ‌ముంది. ఆక‌స్మిక ధ‌న‌యోగం ఉంది. ఆరోగ్యం కుదుట ప‌డుతుంది. కొన్ని అవాంత‌రాలున్నా అనుకున్న ప‌నుల‌న్నీ పూర్తి చేస్తారు. ద‌గ్గ‌రి బంధువుల‌తో విభేదాలు త‌లెత్త‌వ‌చ్చు.

Today rashi phalau in telugu : క‌న్య

ఆర్థికంగా, ఆరోగ్య‌ప‌రంగా స‌మ‌యం పెద్ద‌గా అనుకూలంగా లేదు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ముఖ్య‌మైన ప‌నులు ఒక‌ప‌ట్టాన ముందుకు క‌ద‌ల‌వు. వ్యాపారంలో ఒక మోస్తారు లాభాల‌కు అవ‌కాశ‌ముంది. కొన్ని ఆర్థిక స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌యి. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Also Read : ఆ స్టార్ హీరో సతీమణి పేరుతో ఫేక్ అకౌంట్

Today rashi phalau in telugu : తుల

Ads

ఆర్థిక ప‌రిస్థితి అంత‌గా అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. ప్ర‌య‌త్నాలు ఒక్క‌టొక్క‌టిగా ఫ‌లిస్తాయి. స‌రైన ఆలోచ‌న విధానంతో ముంద‌డుగు వేయండి. కొద్దిగా రుణ స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది. ఉద్యోగ‌, వ్యాపారాల్లో మిశ్ర‌మ ఫ‌లితాలుంటాయి. స‌మాజానికి ప‌నికి వ‌చ్చే ప‌నులు చేప‌డుతారు. ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉద్యోగ‌, వ్యాపారాలు సాఫీగా ముందుకు సాగుతాయి. కొద్దిపాటి ధ‌న లాభానికి అవ‌కాశ‌ముంది. స‌మాజంలో ప‌లుకుబ‌డి పెరుగుతుంది. ఇంటి స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది. వివాహ ప్ర‌య‌త్నాల్లో పురోగ‌తి ఉంటుంది. సంతానం నుంచి శుభ‌వార్త‌లు వింటారు. ఇత‌రుల‌కు స‌హాయ‌ప‌డ‌తారు. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu : ధనస్సు

ఉద్యోగంలో బాగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోండి. ఆదాయ‌ప‌రంగా శుభ‌వార్త వింటారు. ఇంటా బ‌య‌టా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తికి సంబంధించి కొత్త ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. వ్యాపారంలో అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతాయి. నిరుద్యోగుల‌కు అనుకూలంగా ఉంది. తిప్ప‌ట ఎక్కువ‌గా ఉంటుంది.

Today rashi phalau in telugu మకరం

ఉద్యోగంలో శ‌క్తివంచ‌న లేకుండా శ్ర‌మ‌ప‌డ‌తారు. స‌మ‌యం కొద్దిగా అనుకూలంగా ఉంది. త‌ల‌చిన ప‌నులు చాలా వ‌ర‌కు నెర‌వేరుతాయి. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. కుటుంబంలోప్ర‌శాంత ప‌రిస్థితులు నెల‌కొంటాయి. గృహ‌, వాహ‌న యోగా మీద దృష్టి కేంద్రీక‌రిస్తారు. వ్యాపారులు లాభాల బాట ప‌డ‌తారు.

Today rashi phalau in telugu : కుంభం

ఉద్యోగ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. కొద్దిగా ధ‌న‌లాభం ఉంది. కొత్త ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి కుటుంబ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటారు. మిత్రులు ఆపుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోండి. ఇరుగు పొరుగు వారితో వివాదాల‌కు అవ‌కాశ‌ముంది. ఆరోగ్యం కొద్దిగా మెరుగుప‌డుతుంది. హామీలు ఉండ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : మీనం

మంచి ఉద్యోగం వ‌స్తుంది. అనుకున్న ప‌నులు పూర్త‌వుతాయి. ప్రతిదీ ఆలోచించి చేయండి. ప్ర‌ణాళిక బ‌ద్దంగా ప‌ని చేస్తే ల‌క్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. స‌హోద్యోగుల స‌హ‌కారం కూడా తీసుకోండి. బంధువుల‌తో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌.

Ad

Also Read : ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!