Telugu News » Blog » Today rasi phalalu in telugu : ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి జ‌రుగుతుంది

Today rasi phalalu in telugu : ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి జ‌రుగుతుంది

by Anji
Ads

రాశిఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

ఉద్యోగంలో స్థిర‌త్వం ఏర్ప‌డుతుంది. ఆర్థికంగా కూడా మంచి జ‌రుగుతుంది. ఇంటా బ‌య‌టా ఒత్తిడి క‌లిగించే ప‌రిస్థితులుంటాయి. ప్ర‌శాంతంగా కూర్చుని మంచి నిర్ణ‌యాలు తీసుకుంటే భ‌విష్య‌త్‌లో క‌లిసి వ‌స్తుంది. వ్యాపార లాభం క‌నిపిస్తోంది. మిత్రుల ద్వారా మేలు జ‌రుగుతుంది. ఖ‌ర్చుల‌ను వీలైనంత‌గా అదుపు చేస్తారు.

Today rashi phalau in telugu : వృషభం 

దైనందిన కార్యక్రమాలు అన్నీ సకాలంలో పూర్తవుతాయి. భూ వివాదాలు, ఆస్తి వ్యవహరాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.

Today rashi phalau in telugu : మిథునం

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి చేకూరుతుంది. రావలసిన ధనం కొంత మొత్తమైనా చేతికందుతుంది. స్త్రీల సంకల్పం నెరవేరే సమయం ఆసన్నమైంది. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తగలవు. ద్విచక్రవాహానంపై దూరప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ట్రాన్సుపోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలో వారికి మిశ్రమఫలితం.

Today rashi phalau in telugu : సింహం

మీ సంతానం ప్రేమ వ్యవహారాలలో పునరాలోచన అవసరం. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ప్రతి విషయంలో మౌనం వహించడం మంచిదని గమనించండి. స్త్రీలకు కళ్ళు, తలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. మీ బాధ్యతాయుత ప్రవర్తన అధికారులను ఆకట్టుకుంటుంది.

Today rashi phalau in telugu : క‌న్య

వృద్ధాప్యంలో ఉన్న వారికి శారీరిక బాధలు సంభవిస్తాయి. బంధువుల రాక ఇంబ్బదులకు గురిచేస్తుంది. మీ పొదుపరితనం కుటుంబ సభ్యులకు చికాకు కలిగిస్తుంది. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో నిలదొక్కుకోవటానికి ఎంతగానో శ్రమించవలసి ఉంటుంది.

Today rashi phalau in telugu : తుల

వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు బాధ్యతలను నిర్వర్తించడంలో మెలకువ వహించండి. మీ శ్రీమతి వితండవాదం, సంతానం మొండితనం చికాకు కలిగిస్తాయి. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకు లెదుర్కోవలసివస్తుంది. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

స్త్రీలకు టి.వి. ఛానెళ్ళ కార్యక్రమాల సమాచారం అందుతుంది. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా మెలగాలి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. మీ సంకల్పసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. ప్రైవేటు సంస్థలలోని వారు మరో ఉద్యోగంలో చేరే విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీల ప్రజ్ఞాపాఠవాలకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

Today rashi phalau in telugu మకరం

ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువుల రాకతో గృహం కళకళలాడుతుంది. నూతన దంపతులకు సంతానం కలుగు సూచనలు కలవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.

Today rashi phalau in telugu : కుంభం

వ్యాపారాల్లో మొహమాటాలు, భేషజాలకు పోవడం మంచిది కాదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. గృహం కొనుగోలు చేయుప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.

Today rashi phalau in telugu : మీనం

రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాలవారు ఆచితూచి వ్యవహరించాలి. ఆలయ సందర్శనాలలో చికాకులు తప్పవు. క్రీడ, కళారంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని విషయాల్లో ఇతరుల సహాయం అర్థించటానికి మొహ‌మాటం పడతారు. ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు.

 

Also Read : మీ G-mail అకౌంట్ లాక్ అయిందా..? అయితే ఇలా ప్ర‌య‌త్నించండి


You may also like