Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఇది అనువైన సమయం

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఇది అనువైన సమయం

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 02.12.2022: మేషం

ప్రారంభించబోయే పనులకు ఆటంకాుల ఎదురవ్వకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి ఉపయోగపడే ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఇది మీకు అనువైన సమయం. కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కుంటే విజయం సాధించినట్టే. 

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయం కలుగుతుంది. ఓ శుభవార్త మీకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ, సహకారాలు ఉంటాయి.

Today rashi phalau in telugu: మిథునం

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలు సాధిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల అస్సలు వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. గిట్టని వారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనో విచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండడం బెటర్.

Today rashi phalau in telugu : సింహం

మనసు పెట్టి పని చేస్తే విజయం తప్పకుండా కలుగుతుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

లక్ష్యాలకు కట్టుబడి పని చేస్తారు. ధర్మసందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ నేపథ్యంలో ఆచితూచి వ్యవహారించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. 

Today rashi phalau in telugu : తుల

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఓ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా జాగ్రత్తపడాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి. సమన్వయలోపం లేకుండా చూసుకోవాలి. సమర్థతను పెంచుకోవాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

మనోధైర్యంతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ఓ పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలున్నాయి.

Today rashi phalau in telugu : కుంభం

ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కీలక వ్యవహారంలో పెద్దల సలహా తీసుకోవడం ఉత్తమం. బంధు, మిత్రులతో సుఖ, సంతోషాలతో గడుపుతారు.

Today rashi phalau in telugu :  మీనం

శుభ ఫలితాలను సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. 

Visitors Are Also Reading