Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు మాట విలువ‌ను కాపాడుకోవాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు మాట విలువ‌ను కాపాడుకోవాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 12.08.2022: మేషం

బంధు, మిత్రుల ఆనందంగా గ‌డుపుతారు. అధికారుల సాయంతో ఓ ప‌ని పూర్తి చేస్తారు కుటుంబ స‌భ్యుల స‌హ‌కారముంటుంది. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నంతో స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డుతాయి.

Today rashi phalau in telugu: వృషభం 

ప్ర‌శాంత‌మైన ఆలోచ‌న‌ల‌తో గొప్ప వారు అవుతారు. మాట విలువ‌ను కాపాడుకోవాలి. ధ‌న‌, ధాన్య లాభాలుంటాయి. అవ‌స‌రానికి ఆదుకునే వారుంటారు.

Today rashi phalau in telugu: మిథునం

శారీర‌క శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. గ‌తంలో పూర్తి కాని ఒక ప‌ని ఇప్పుడు పూర్త‌వుతుంది. బ‌ల‌మైన ప్ర‌య‌త్నంతో ధ‌న‌లాభం ఉంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

చేప‌ట్టే ప‌నులు విజ‌యాన్ని చేకూరుస్తాయి. బంధుప్రీతి ఉంది. ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి అంద‌రి నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటారు. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

పెద్ద‌ల స‌ల‌హాలు శ‌క్తినిస్తాయి. మ‌నోవిచారం క‌లిగించే సంఘ‌ట‌న‌కు దూరంగా ఉండాలి. దైవ‌ధ్యానంతో ఆప‌ద‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త చాలా అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ మీ రంగాల్లో మ‌ధ్యమ ఫ‌లితాలున్నాయి. ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. తోటి వారి సాయంతో కొన్ని కీల‌క ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. మ‌న‌శ్సాంతి కోల్పోకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : తుల

కీల‌క విష‌యాల్లో శ్ర‌ద్ధ చూపండి. ఖ‌ర్చుల విష‌యంలో పొదుపును పాటించాలి. అకార‌ణ క‌ల‌హ సూచ‌న ఉంది. అన‌వ‌స‌ర విష‌యాల్లో ఊరుకోవ‌డం ఉత్త‌మం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగి విజ‌యాన్ని సాధిస్తారు. ఒక ముఖ్యైన విష‌యమై అధికారుల‌ను క‌లుస్తారు. ఫ‌లితం సానుకూలంగా వ‌స్తుంది. అప్పుల బాధ పెర‌గ‌క‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో శోధ‌న చాలా అవ‌స‌రం. ప‌నుల్లో ఆటంకాలు క‌లుగుతాయి. తొంద‌ర‌పాటు చ‌ర్య‌లు వ‌ద్దు. ఎవ్వ‌రినీ ఎక్కువ‌గా న‌మ్మ‌వ‌ద్దు. మ‌న‌సును స్థిరంగా ఉంచుకోవాలి. ఓ వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఫ‌లితాలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది. బంధు, మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. కుటుంబ స‌భ్యుల‌కు మంచి జ‌రుగుతుంది. య‌శ‌స్సు, మ‌నోల్లాసం, ధ‌ర్మ‌సిద్ధి క‌లుగుతాయి.

Today rashi phalau in telugu : కుంభం

మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. తోటి వారి స‌హ‌కారాలు అందుతాయి. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. మీ బుద్ధిబ‌లంతో కీల‌క స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించి అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతారు.

Today rashi phalau in telugu :  మీనం

ధ‌ర్మ సిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో విశేష‌మైన ఫ‌లితాలు ఉంటాయి. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. గొప్ప భ‌విష్య‌త్ కు పునాదులు వేస్తారు.

Visitors Are Also Reading