Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వైరాగ్యాన్ని ద‌రిచేర‌నీయ‌కండి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వైరాగ్యాన్ని ద‌రిచేర‌నీయ‌కండి

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Today Rashi phalau in Telugu 20.04.2022: మేషం

 

తోటి వారితో క‌లిసి తీసుకునే నిర్ణ‌యాలు మేలు చేస్తాయి. ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు పాటించాలి.

Today rashi phalau in telugu : వృషభం 

మీమీ రంగాల‌లో అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. చేసే ప‌నిలో స్ప‌ష్ట‌త పెరుగుతుంది. కీల‌క విష‌యాల‌లో తోటివారి స‌ల‌హాలు త‌ప్ప‌నిస‌రి. స‌మ‌యం వృథా చేయ‌కండి.

Today rashi phalau in telugu : మిథునం

ఒక ముఖ్య‌మైన ప‌నిని పూర్తి చేస్తారు. బాధ్య‌త‌లు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో శుభ‌ఫ‌లితాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముంద‌డుగు ప‌డుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

చిత్త‌శుద్ధితో చేసే ప‌నుల వ‌ల్ల మంచి చేకూరుతుంది. చంచ‌ల నిర్ణ‌యాలు ఇబ్బంది పెడ‌తాయి. మ‌నో ధైర్యాన్ని కోల్పోవ‌ద్దు. మాట విలువ‌ను కాపాడుకోవాలి. అన‌వ‌స‌ర క‌ల‌హాల‌తో స‌మ‌యం వృథా కానీయ‌కండి.

Today rashi phalau in telugu : సింహం

ఉత్సాహంగా ప‌ని చేస్తే కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతంగా పూర్త‌వుతాయి. స్థిరాస్తి కొనుగోలు విష‌యాలు ల‌భిస్తాయి. మీ స్వ‌ధ‌ర్మం మిమ్మల్ని కాపాడుతుంది.

Today rashi phalau in telugu : క‌న్య

మీమీ రంగాల‌లో ఆశించిన ఫ‌లితాల‌ను రాబ‌డ‌తారు. అదృష్టం వ‌రిస్తుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ స‌భ్యుల‌తో ఆనంద‌క‌ర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

తోటివారి స‌హ‌కారంతో ప‌నులు పూర్త‌వుతాయి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త‌లు వింటారు. ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మ‌నః సౌఖ్యం ఉంది. కీల‌క మైన విష‌యాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు జ‌రిగే అవ‌కాశాలున్నాయి. వైరాగ్యాన్ని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : ధనస్సు



ముఖ్య‌మైన ప‌నుల‌ను కొద్ది రోజులు వాయిదా వేసుకోవ‌డం మంచిది. కొన్ని సంఘ‌ట‌న‌లు నిరుత్సాహ‌ప‌రుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today  rashi phalau in telugu మకరం

స‌కాలంలో ప‌నులు పూర్త‌వుతాయి. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. బంధు, మిత్రుల‌తో క‌లిసి కొన్ని ముఖ్యమైన నిర్ణ‌యాలు తీసుకుని భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు.

Today rashi phalau in telugu : కుంభం

సంతోష‌క‌ర‌మైన వార్త వింటారు. శ‌రీర సౌఖ్యం ఉంది. బంధువుల‌తో ప్రేమ‌గా వ్య‌వ‌హ‌రించాలి. భోజ‌న సౌఖ్యం ఉంది.

Today rashi phalau in telugu : మీనం

మీ ప‌ట్టుద‌లే మిమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది. ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృతం అవుతాయి. ఆర్థికంగా మిశ్ర‌మ‌కాలం. విందు, వినోదాల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

ఇవి కూడా చదవండి :

  1. తెలంగాణ అరుదైన రికార్డు.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీ వీల‌ర్ ఫ్యాక్ట‌రీ..!
  2. “ఆచార్య” క‌థ బాల‌య్య కోసం రాసిందా..? ఇదెక్క‌డి ట్విస్ట్ రా బాబూ…!
  3. మెగాస్టార్ ఆచార్య ర‌న్ టైమ్ ఎంతంటే..?
Visitors Are Also Reading