RRR మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ఎంతో పేరును సంపాదించుకున్నారు. తన నటనతో అదరగొట్టి టైగర్ లా దూసుకుపోతున్నారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేకమైన అభిరుచి ఉంది. ఖరీదైన కార్లు కొనడం అంటే భలే సరదా. కొనడమే కాదు వాటీ నెంబర్ల విషయంలో కూడా తగ్గేదే లేదు అంటారు ఎన్టీఆర్.. అయితే సాధారణంగా సెలబ్రిటీలు మార్కెట్లోకి ఎలాంటి విలాసవంతమైన కార్లు వచ్చినా ముందుగా కొనేస్తారు. కోట్ల రూపాయల ధర ఉన్న కానీ ఏ మాత్రం ఆలోచించకుండా అధునాతన ఫీచర్లు ఉన్న కార్లను తీసుకొని ఎంజాయ్ చేస్తారు.
వీళ్లలో ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల కంటే ముందే మార్కెట్లోకి తనకు వచ్చిన కారు వస్తే కొనుగోలు చేయడంలో ముందుంటారు. ఇప్పటికే ఎన్టీఆర్ దగ్గర ఎన్నో ఖరీదైన కార్లు చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ తన కారుకు తొమ్మిది అంకే వచ్చే నెంబర్లని ఎంపిక చేసుకునేవారట. అంటే 9,99,999 ఈ విధంగా నెంబర్ వచ్చేటట్టు చూసుకునే వారట. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఆయన పేరు పెట్టుకుని ఆయన అభిరుచి లోనే నడుచుకుంటున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తన వాహనాలకు 9 అంకె వచ్చేలా చూసుకుంటారు.
Advertisement
Advertisement
తాజాగా ఎన్టీఆర్ అత్యంత ఖరీదైనటువంటి లంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాఫుసల్ అనే వాహనాన్ని కొన్నారు. అయితే ఈ కారుకు 9999 అనే నెంబర్ ను ప్రత్యేకంగా తీసుకున్నారు. ఈ నెంబర్ ను ఖైరతాబాద్ ఆర్టీఏ నుంచి TS 09, FS 9999 అనే నెంబర్లు తన కారుకు తీసుకున్నారు. దీనికోసం ఆయన 17 లక్షల రూపాయలు చెల్లించారట. ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ కోసం చాలామంది ఆన్లైన్లో వెతుకుతూ ఉంటారు. ఈ విధంగా ఆర్టీఏ అధికారులు కూడా ఫ్యాన్సీ నెంబర్లను వేలం నిర్వహించీ దాని ద్వారా భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందుతూ ఉంటారు.
also read;
నయనతార భర్త విఘ్నేష్ శివన్ గురించి షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?
భర్తలకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లే భార్యలు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!