Home » వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని అస్సలు తినకూడదట.. ఏంటవి..?

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని అస్సలు తినకూడదట.. ఏంటవి..?

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం వర్షాలు జోరుగా కొడుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లతో నిండి ఉన్నాయి. ఈ తరుణంలో దోమలకు ఇతరాత్రా సీజనల్ వ్యాధులకు వర్షాకాలం అనువైన సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలోనే ఎక్కువ జ్వరాలు కూడా వస్తుంటాయి. ఈ క్రమంలో మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఓ సారి చూద్దాం.. వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు రావడం వల్ల దగ్గు, జలుబు,జ్వరం సీజనల్ వ్యాధులకు తోడు ఎసిడిటీ, వికారం,బరువు పెరగటం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలామంది ఎక్కువ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు తింటారు. ఇవి కూడా అనారోగ్యానికి దారితీస్తాయి. కాబట్టి వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారంలో మార్పులు తీసుకొని రావాలి అంటున్నారు వైద్యులు. ఈ వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలను అవైడ్ చేస్తే మంచిదని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.. వర్షాకాలంలో పాలు,పెరుగును తక్కువ తీసుకుంటే మంచిది. ఈ సీజన్లో పశువుల మేత పై పెరిగే కీటకాలు పాలు లేదా ఇతర వస్తువుల ద్వారా మనపై ప్రభావం చూపుతాయట. ఆహార నిపుణుల సూచనల ప్రకారం వర్షాకాల సీజన్లో ఆకుకూరలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్ లో ఆకులపై క్రీములు పెద్ద మొత్తంలో పెరిగిపోతాయని, నిపుణులు చెబుతుంటారు.

 

అలాంటి పరిస్థితుల్లో వాటిని సరిగా శుభ్రం చేసుకోకుండా తింటే అనారోగ్యానికి గురవుతారు. వర్షాకాలంలో బెండకాయలు, క్యాబేజ్ వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో వాటిలో ఎక్కువగా క్రిములు పెరుగుతాయట. అవి ఉదరానికి సంబంధించిన సమస్యలను కలిగిస్తాయట. వర్షాకాలంలో మాంసానికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వాతావరణంలోని తేమ కలుషిత నీరు వల్ల మాంసం త్వరగా చనిపోతుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading