Home » అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే ఫ‌లితం ప‌క్కా..!

అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే ఫ‌లితం ప‌క్కా..!

by Anji
Ad

ప్ర‌స్తుత కాలంలో బ‌రువు పెర‌గ‌డం ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రినీ ఈ స‌మ‌స్య వేధిస్తుంది. మారిన జీవన విధానం, పోష‌కాహార లోపం దీనికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. అధిక బ‌రువుతో బాధ‌ప‌డేవారు న‌ల‌గురిలో క‌ల‌వ‌డానికి అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. కొన్ని చిట్కాలు పాటిస్తే అధిక బ‌రువు స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అవి ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

ఆకలి లేద‌నో, ప‌ని ఒత్తిడి ఇలా ఇత‌ర బిజీ పనుల వ‌ల్ల ఉద‌యం టిఫిన్ తీసుకోకుండా ఉండిపోవ‌డం ఆరోగ్యానికి ఎంతో హానిక‌రం. టిఫిన్ తిన‌కుండా ఒకేసారి మ‌ధ్యాహ్నం భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇలా చేయ‌డం వల్ల శ‌రీరంలోకి చెడు కొవ్వు చేరుతుంది. దీంతో భారీ కాయం ఏర్ప‌డుతుంది. ఉదయం టిఫిన్ చేయ‌డం మాత్రం మ‌ర్చిపోవ‌ద్దు.

 Also Read : నిత్యం ఈ 5 ర‌కాల పండ్ల‌ను తీసుకుంటే మీ కొవ్వు క‌రిగిపోవ‌డం ప‌క్కా..!

రోజుకి 3 లీట‌ర్లు నీళ్లు తాగాలి. పొద్దున నిద్ర లేవ‌గానే ఎక్కువ మోతాదులో నీరు తాగ‌డం చాలా మంచిది. ఇలా చేస్తే మీకు మూత్ర విస‌ర్జ‌న సాఫీగా సాగుతుంది. మ‌నం ఏ ఆహారం తీసుకున్న ఎక్కువ నీరు తాగ‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. అదేవిధంగా మ‌న దేహంలో చెడు కొవ్వుని త‌గ్గించి ఆరోగ్యంగా ఉండేవిధంగా చేస్తుంది.

Advertisement

ప్ర‌తి రోజు పండ్లు, కూర‌గాయ‌లు తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పండ్లు కూర‌గాయ‌ల్లో ఎన్నో మంచి ప్రోటిన్స్‌, ప్రోటిన్స్ ఉంటాయి. మ‌న ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. పండ్లు తిన‌డం ఇష్టం లేని వారు ప‌ళ్ల ర‌సాలు తాగ‌వ‌చ్చు. రోజు పండ్లు, కూర‌గాయ‌లు తిన‌డం మ‌న‌దేహం పై ముడుత‌లు తొల‌గిపోయి య‌వ్వ‌నంగ క‌న‌ప‌డుతారు.

Also Read :  గోళ్లు కొరికే అలవాటు ఉంటే ఇలా దూరం చేసుకోండి..!

ఉప్పు, కారం, మ‌సాలాలు తిన‌డం ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. మ‌న జీర్ణ శ‌క్తిని దెబ్బ‌తీస్తాయి. ఉప్పు, కారం, మ‌సాలాలు తిన‌డం వ‌ల్ల బిపి, అల్స‌ర్‌, ఊబ‌కాయం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఉప్పు, కారం, మ‌సాలాలు అధిక ప‌రిమాణంలో తీసుకోవ‌ద్దు. త‌క్కువ మోతాదులో ఉప‌యోగించుకోండి. ఏ ఆహారం అయిన అధిక మొత్తంలో తీసుకోవ‌డం ఆరోగ్యానికి హానిక‌రం.

మాంసహారాన్ని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ఎక్కువ మాంసాహారాన్ని తిన‌డం వ‌ల్ల అజీర్తి, ఊబ‌కాయం, గ్యాస్ ట్ర‌బుల్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మాంసాహారం ఎక్కువ మోతాదులో కాకుండా త‌క్కువ మోతాదులో తీసుకోవ‌డం మంచిది. మాంసాహారం అధిక మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ ప్ర‌క్రియ మంద‌గిస్తుంది.

Also Read :  కంప్యూట‌ర్ టైపింగ్‌తో వేళ్లు నొప్పులా ? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు..!

Visitors Are Also Reading