Home » టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఎలా ఉందంటే ?

టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఎలా ఉందంటే ?

by Anji
Ad

ఇటీవలే రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఈ సినిమా ఆశించిన మేరకు ఆకట్టుకోలేకపోయింది. ఇక తరువాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మూవీ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ వీడియోను తెలుగుతో పాటు ఇతర భాషల్లో పలువురు స్టార్ హీరోలు విడుదల చేశారు. 

Advertisement

ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయడంతో పాటు.. రవితేజ పాత్రను కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వాయిస్ అందించారు. 1970 కాలంలో నాటు టైగర్ జోన్ గా పేరు పొందిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు లుక్ చాలా బాగుంది. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. గత కొద్ది రోజులుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని అక్టోబర్ 20న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు. ముఖ్యంగా జింకని వేటాడే పులిని చూసుంటావు, పులిని వేటాడే పులిని చూశావా అంటూ రవితేజ చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. రవితేజ కి జంటగా నుపుర్ ఠాకూర్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  

Advertisement

రావణాసుర లాంటి డిజాస్టర్ అందుకున్న రవితేజకు ఈ సినిమా హిట్ అవ్వడం కీలకమనే చెప్పాలి. వాస్తవానికి టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రారంభమై చాలా కాలం అవుతున్నా పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయింది.  రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రేణుదేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తరువాత రేణుదేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా గ్లింప్స్ కి తెలుగులో వెంకటేష్, కన్నడలో శివరాజ్ కుమార్, తమిళంలో కార్తీ, మలయాలంలో దుల్కర్ సల్మాన్, హిందీలో జాన్ అబ్రహం లు వాయిస్ ఓవర్  ఇచ్చారు. భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న టైగర్ నాగేశ్వరరావు రవితేజకి పాన్ ఇండియా హిట్ అందిస్తుందో లేదో వేచి చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మోహన్ బాబు కి ఎస్పీ బాలు మధ్య ఇంత పెద్ద గొడవ జరిగిందా..?

ఆ ఒక్క తప్పు చేయకుంటే.. ఇప్పటికీ ఉదయ్ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోవ్ !

Visitors Are Also Reading