Home » కారుకు ఎదురుగా వచ్చిన పులి….ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా…!

కారుకు ఎదురుగా వచ్చిన పులి….ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా…!

by AJAY
Ad

నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు సేవలు అందించారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జీవితంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ శ్రీదేవి జంటగా దేవత అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలోని “కన్నుల్లో మిసమిసలు” అనే పాటను చిత్రించడం కోసం సాతానూరు వెళ్లారు. ఎన్టీఆర్ తో పాటు పద్మనాభం ఒకే కారులో ఉన్నారు.

Advertisement

రాత్రి 9 గంటలకు మద్రాసు నుండి ఇద్దరు బయలుదేరారు. తిరువన్నామలై మీదగా సాతానూరు వెళ్తున్నారు. కాగా జర్నీలో ఎన్టీరామారావు తనకు నిద్ర వస్తుందని పడుకున్నారు. అయితే అలా ఇద్దరూ కారులో వెళుతున్న సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. కారుకు ఎదురుగా ఒక పులి వచ్చింది. దాంతో కారు నడుపుతున్న డ్రైవర్ వణికిపోయారు. కారులో ఉన్న పద్మనాభం కూడా భయపడిపోయారు.

Advertisement

also read : CM గా ఉండి NTR న‌టించిన సినిమా! షూటింగ్ స్పాట్ కే ఫైల్స్!!

కానీ ఎన్టీఆర్ మాత్రం గాఢనిద్రలో ఉన్నారు. అయితే తనను నిద్ర లేపవద్దని చెప్పడంతో పులి వచ్చినప్పటికీ ఎన్టీఆర్ ను పద్మనాభం లేపలేదు. కానీ ఎన్టీఆర్ లేచిన తర్వాత ఈ విషయాన్ని చెప్పగా ఆయన ఆసక్తికరమైన సమాధానమిచ్చారట. పద్మనాభం ఎన్టీఆర్ తో మీరు పడుకున్న సమయంలో కారు ఎదురుగా పులి వచ్చింది అని చెప్పారు.

దాంతో డ్రైవర్ భయపడిపోయారని అన్నారు. తనకు కూడా ఒంటిలో వనుకు పుట్టిందని పద్మనాభం ఎన్టీఆర్ కు తెలిపారు. కానీ ముందు కారు ముందు పులి ఉంటే తమ కారులో సింహం ఉందని ధైర్యం తెచ్చుకున్నామని ఎన్టీఆర్ కు పద్మనాభం చెప్పారు. దాంతో ఎన్టీఆర్ శభాష్ బ్రదర్ అంటూ పద్మనాభం బుజం తట్టారు. అంతేకాకుండా పులి ఎదురుగా వస్తే శుభపరిణామం అంటూ ఎన్టీఆర్ చెప్పారని పద్మనాభం అన్నారు.

Visitors Are Also Reading