Home » పాపమని పిలిచి ఉద్యోగం ఇచ్చింది..వాళ్ల పిల్లనే వల్లో పడేసి భార్యగా.. అందరూ చూడాల్సిన లవ్ స్టోరీ..!!

పాపమని పిలిచి ఉద్యోగం ఇచ్చింది..వాళ్ల పిల్లనే వల్లో పడేసి భార్యగా.. అందరూ చూడాల్సిన లవ్ స్టోరీ..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

కొంతమంది లవ్ స్టోరీలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి.కొంతమందికి ఇలాంటి లవ్ స్టోరీలు కలిసి వస్తే మరి కొంతమందిని ఇబ్బందుల పాలు చేస్తాయి.. కానీ ఈ వ్యక్తి జీవితాన్ని మార్చేసిన లవ్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.. తన లవ్ స్టోరీ గురించి తన మాటల్లోనే తెలుసుకుందాం.. నా జీవితం గురించి ఆలోచిస్తే నాకే నవ్వొస్తుంది.. నేను ఏ విధంగా ఉండేవన్నో ఎలా మారిపోయానో అంటే విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు.. ఒకరి దగ్గర ఆటో కిరాయికి తీసుకొని ఆటో నడపడం వచ్చిన డబ్బులతో కొంత ఓనర్ కి ఇచ్చి ఆటో అప్పజెప్పి మిగిలిన డబ్బులతో జల్సా చేయడం నా లైఫ్..

ఇవి కూడా చదవండి: విలన్ తో తమన్నా డేటింగ్.. వీడియో లీక్ !

Advertisement

Advertisement

అలా సాగుతూ వస్తున్న తరుణంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి పొద్దంతా ఆటో ఏం నడుపుతావు నాకు తెలిసిన వాళ్ళ మొబైల్ క్యాంటీన్ ఉంది . వారి ట్రక్ నడపడానికి డ్రైవర్ కావాలి. రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి 9 గంటల వరకు ఉంటే 300 రూపాయలు ఇస్తారని చెప్పాడు. దీంతో ఆటో నడపడం మానేసి ఆ జాబు లోకి షిఫ్ట్ కావాలని భావించాను. మరుసటి రోజు ఎలాగోలా అడ్రస్ కనుక్కొని వాడి దగ్గరికి వెళ్లాను. అక్కడ ఒక 50 సంవత్సరాల పెద్దావిడ టిఫిన్ చేయడం,వాళ్ల కూతురు వాటిని అమ్మడం.. వారికి నేను సహాయం చేస్తూ ఉండటం. అలా రెండు సంవత్సరాలు గడిచింది. ఇంతలో ఆ ఓనర్ కూతురుతో కాస్త పరిచయం పెరిగింది.

ఇవి కూడా చదవండి: మరిగించిన నిమ్మకాయ నీరు తాగితే ఇన్ని లాభాలా..? ఏ సమయంలో తాగాలంటే..!

అది కాస్త ప్రేమగా మారింది. వారి టిఫిన్స్ బిజినెస్ ఏ విధంగా పెరిగిందో మా ప్రేమ కూడా అలాగే పెరుగుతూ వచ్చింది.. అదేంటో కానీ మా ఇద్దరి ప్రేమ విషయం తెలియకుండానే వాళ్ళ అమ్మ నాతో మా అమ్మాయిని చేసుకో అని అనేసింది. బహుశా నా మంచితనాన్ని గమనించి అలా అని ఉండవచ్చు. ఇంకేముంది ఆరు నెలల్లో మా పెళ్లయింది. మేము ఏ స్థలంలో అయితే మొబైల్ క్యాంటీన్ నడిపామో.. అక్కడే ఒక పెద్ద రెస్టారెంట్ ను స్టార్ట్ చేసాం. ఆ రెస్టారెంట్ కు మా కూతురు పేరు అమృత అని పెట్టాం. అసలు బాధపడాల్సిన విషయం ఏంటంటే నాకు జీవితాన్ని ఇచ్చిన మా అత్త ఇప్పుడు మాతో లేదు..

Visitors Are Also Reading