Telugu News » స‌మ‌తామూర్తి సంద‌ర్శ‌న‌కు టికెట్‌.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ప్రేమ్ ఏర్పాటు

స‌మ‌తామూర్తి సంద‌ర్శ‌న‌కు టికెట్‌.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ప్రేమ్ ఏర్పాటు

by Anji

ఆధ్యాత్మిక ప‌ర్యాట‌క కేంద్రంగా రూపుదిద్దుకున్న రామానుజుల స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వ‌హ‌ణ‌కు భారీ క‌స‌ర‌త్తు జ‌రుగుతుంది. 216 అడుగుల విరాట్ మూర్తి, 120 కిలోల బ‌రువు ఉన్న 54 అంగుళాల స్వర్ణ‌మూర్తి 108 వైష్ణ‌వ ప్ర‌ధాన ఆల‌యాలు.. ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌ల‌తో ఉన్న ఈ క్షేత్ర నిర్వ‌హ‌ణ‌కు నిర్వాహ‌కులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.1200 కోట్ల వ్య‌యంతో రూపొందించిన ఈ క్షేత్రంలో ద‌ర్శ‌నానికి రుసుము పెడుతున్నారున‌. తొలుత పెద్ద‌ల‌కు రూ.500, చిన్నారుల‌కు రూ.200 టికెట్ ధ‌ర నిర్ణ‌యించాల‌ని భావించారు. కానీ అది భ‌క్తుల‌కు భారం అవుతుంద‌నే భావన‌తో పెద్ద‌ల‌కు రూ.150, చిన్నారుల‌కు రూ.75 ఖ‌రారు చేశారు.

Ads

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారు శుభ‌వార్త వింటారు

ఈ మేర‌కు జ‌రిగిన స‌మావేశంలో నిర్ణ‌యించారు. రామానుజాచార్యుల స్వ‌ర్ణ మూర్తికి ప్ర‌త్యేక భ‌ద్ర‌త ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా విగ్ర‌హానికి 6 నుంచి 8 అడుగుల దూరం నుంచి బుల్లెట్ ప్రూప్ ఫ్రేమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసేంత వ‌ర‌కు స్వ‌ర్ణ మూర్తి సంద‌ర్శ‌న‌కు అనుమతించ‌రు. అదేవిధంగా ప్రత్యేక భ‌ద్ర‌తాను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ముఖ్యంగా ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌తో ఉన్న ఈ క్షేత్ర నిర్వ‌హ‌ణ‌కు నిర్వాహ‌కులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప‌నుల‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుతున్నారు. ఈ ప‌నులు పూర్త‌య్యేంత వ‌ర‌కు కేవ‌లం సాయంత్రం వేళ‌నే ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తి ఉంటుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి రాత్రి ఆరున్న‌ర గంట‌ల వ‌ర‌కు అనుమ‌తిస్తారు. ప‌నులు పూర్త‌యిన త‌రువాత ఉద‌యం, సాయంత్రం వేళ‌లో అనుమ‌తించ‌నున్నారు.

Also Read :  నాగ‌చైత‌న్య ఓకే అంటే నీతో పెళ్లికి రెడీ.. స‌మంత ట్వీట్‌..!

  • ప్రాంగ‌ణంలో 250 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఫీడ్‌ను ప‌రిశీలించేందుకు ప్ర‌త్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు. అదేవిధంగా మ‌రొక నెల‌రోజుల్లో ప‌నులు పూర్త‌వుతాయ‌ని నిర్వ‌హ‌కులు పేర్కొంటున్నారు. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల 3డీ, లేజ‌ర్ షోను తాత్కాలికంగా నిలిపివేశారు.

 

  • 50 ఎక‌రాల్లో విస్త‌రించిన ఈ క్షేత్రాన్ని నిరంత‌రం ప‌ర్య‌వేక్షించేందుకు రెండు షిప్టుల్లో 300 మంది భ‌ద్ర‌తా సిబ్బంది ఉంటారు. లోప‌ల‌కు ఎంత మంది వ‌చ్చారు. బ‌య‌ట‌కు తిరిగి ఎందరూ వెళ్లార‌న్న వివ‌రాల‌ను తెలిపే ఏర్పాటు చేస్తున్నారు. రెండు సంఖ్య‌లు మ్యాచ్ కాకుంటే లోప‌ల అనుమానితులు ఉండిపోయార‌ని భావించి క్షుణ్ణంగా త‌నిఖీ చేసే వ్య‌వ‌స్థ ఏర్పాటు చేస్తున్నారు.

  • ప్రాంగ‌ణంలోకి మొబైల్ ఫోన్లు, ఇత‌ర బ్యాగేజీని అనుమ‌తించ‌కూడ‌ద‌ని భావిస్తున్నారు. టికెట్ కౌంట‌ర్ప‌క్క‌న ప్ర‌త్యేక కౌంట‌ర్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో సెల్‌ఫోన్లు, ల‌గేజీ, పాద‌ర‌క్ష‌లు అప్ప‌గించాలి. ఫుడ్‌కోర్టు ద‌గ్గ‌ర నిష్క్ర‌మ‌ణ మార్గం ఉంటుంది. ఎంట్రీ వ‌ద్ద అప్ప‌గించిన వ‌స్తువులు క‌న్వేయ‌ర్ బెల్టు ద్వారా ఎగ్జిట్ వ‌ర‌కుచేరుతాయి. అక్క‌డ వాటిని తీసుకుని బ‌య‌టికి రావాల్సి ఉంటుంది.

 

  • వాహ‌నాల‌ను స్కాన‌ర్ల‌తో త‌నిఖీ చేస్తారు. అనుమానిత వాహ‌నాల‌ను ఆపేందుకు బూమ్ బారియ‌ర్స్ బొల్లార్ట్ష్ ఉంటాయి. వాటిని ఛేదించుకుని వెళ్లే ప్ర‌య‌త్నం చేసే వాహ‌నాల టైర్ల‌ను చీల్చే టైర్ కిల్ల‌ర్స్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

 

  • ఈ కేంద్రంలో 250 మంది అర్చ‌కుల‌ను నియ‌మించ‌నున్నారు. దివ్వ దేశాలుగా పేర్కొనే 108 ఆల‌యాల‌కు ఇద్ద‌రు చొప్పున మిగ‌తా ఆల‌యాల్లో మ‌రికొంద‌రిని నియ‌మిస్తున్న‌ట్టు నిర్వాహ‌కులు తెలిపారు. ఇత‌ర అవ‌స‌రాల‌కు క‌లిపి మొత్తం 800 మంది సిబ్బంది ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు.

Also Read :  Bappi Lahiri: సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హిరి క‌న్నుమూత


You may also like