ప్రముఖ షార్ట్ వీడియో మెసేజింగ్ యాప్ టిక్ టాక్ గతంలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసినదే. చైనా తరువాత అత్యధిక యూజర్లు ఉన్నది మన భారత్‌లోనే కావడం విశేషం. లాంచ్ చేసిన కొద్ది రోజుల్లోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు అత్యంత వేగంగా పాకేసింది టిక్‌టాక్. భారత్‌లో ఎంతో మంది టిక్ టాక్ ద్వారా చాలా ఫేమస్ కూడా అయ్యారు. డ్యాన్స్, కామెడీ వంటి పలు రకాల వీడియోలు చేసి అప్లోడ్ చేసి కాసుల పంట పండించుకున్నారు. ఎంతో మంది సెలబ్రిటీలయ్యారు. ఈ యాప్ ద్వారా బోల్డ్ కంటెంట్ కూడా ఎక్కువ అయిందనే చెప్పవచ్చు.
Advertisement
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. చాలా మంది టిక్ టాక్‌లో మునిగిపోయేవారు. సోషల్ మీడియాలో నెంబర్ వన్ గా కొనసాగింది టిక్ టాక్. ఇక ప్రపంచ వ్యాప్తంగా 2020లో అత్యధికంగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. కొన్ని కోట్ల మందికి టిక్ టాక్ ఓ వ్యసనంలా మారిందనే చెప్పవచ్చు. 2020లో అనుకోకుండా కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత దృష్ట్యా టిక్ టాక్ బ్యాన్ చేసింది. చైనా యాప్ కావడంతో దేశ సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నారనే అనుమానంతో ఈచర్యలకు పూనుకున్నది. దీంతో టిక్‌టాక్ యాప్ భారత్‌లో పూర్తిగా నిషేదించబడింది. ఇలా ప్రపంచంలో చాలా దేశాలు ఇండియా మాదిరిగానే ఈ యాప్‌ను బ్యాన్ చేశాయి.
Advertisement
భారత్‌కు చెందిన హిరనందిని రూప్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకొని టిక్‌టాక్‌ను మళ్లీ లాంచ్ చేయాలని బైట్ డ్యాన్స్ ఆలోచిస్తుందని ఎకానమిక్స్ టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ కంపెనీ భాగస్వామ్యంతోనే భారత్‌లో డేటా స్టోర్ అయ్యేవిధంగా చర్యలు తీసుకుని టిక్‌టాక్‌ను రీ లాంచ్ చేయాలని సిద్ధమవుతున్నారు. డేటా స్టోరేజీని ఇండియాలోనే భద్రపరిచేవిధంగా మార్పులు చేసుకుంటే అనుమతి ఇచ్చే అవకాశముందని చర్చ కొనసాగుతుంది. హిరనందిని అనే రియల్ ఏస్టేట్ డెవలఫర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని డేటాను ఇక్కడే స్టోర్ చేయాలని బైట్ డ్యాన్స్ ప్రయత్నిస్తోంది. అయితే భారత ప్రభుత్వం టిక్ టాక్‌కు అనుమతి ఇస్తుందా లేదా అనేది మాత్రం తెలియాలంటే కొద్ది వేచి చూడాల్సిందే..!
Also Read :
Bigg Boss 6 : బిగ్‌బాస్ 6లో మెరవనున్న జబర్దస్త్ బ్యూటీ..!
భార్య, భర్తలు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఈ మూడు కారణాలే విడిపోవడానికి కారణమట !