Home » బింబిసార 2కి ఇంకా మూడేళ్లు ఆగాల్సిందేనా..?

బింబిసార 2కి ఇంకా మూడేళ్లు ఆగాల్సిందేనా..?

by Azhar
Ad

కళ్యాణ్ రామ్ హీరోగా తాజాగా ఈ నెల 5న అభిమానుల ముందుకు వచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని బింబిసార అనే రాజుపై వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ తో పాటె.. అప్పటికి హిస్ లేక కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీ కష్టాలను కూడా తీర్చేసింది. అయితే విడుదలకు ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అనేవి లేవు. కానీ ఈ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత ఫ్యాన్స్ థియేటర్ కు వచ్చి సినిమా చూసారు.

Advertisement

ఇక ఈ మధ్యే హిట్ అయిన అన్ని సినిమాలు సీక్వెల్ అని ఎలా అంటున్నాయో.. బింబిసార చిత్ర బృందం కూడా సీక్వెల్ ఉంది అని ప్రకటించింది. దాంతో అప్పటి నుండి ఆ బింబిసార 2 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చుస్తున్నారు. కానీ వారు ఎదురు చూపుకు ఫలితం కోసం కనీసం మూడేళ్లు ఆగాల్సిందిగా తెలుస్తుంది. అందుకు కారణం కళ్యాణ్ రామ్ ఇప్పటికే ఒప్పుకున్నా సినిమాలు.

Advertisement

అయితే ఈ బింబిసార విడుదలకు ముందే కళ్యాణ్ రామ్ మూడు సినిమాలు ఓకే చెప్పాడు. అయితే ఎప్పుడు తన సొంత బ్యానర్ లో సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ ఈ మూడు సినిమాలు కూడా వేరే బ్యానర్ లో చేయబోతున్నాడు. కాబట్టి ఆ సినిమాలను వాయిదా వేసే అవకాశం అనేది లేకుండా పోయింది. ఇక ఈ మధ్యే కాలంలో ఒక్క సినిమా విడుదలకు కనీసం ఏడాది పడుతుంది.. కాబట్టి బింబిసార 2 అనేది స్టార్ట్ కావడానికి మూడేళ్లు అవుతుంది అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

బాబర్ వల్లే ఇండియా గెలిచింది.. ఎలా అంటే..?

ఐపీఎల్ లో కొత్త ఫీచర్స్ తేబోతున్న రిలయన్స్..!

Visitors Are Also Reading