Home » మహేష్ మాబు సినిమాలో థోర్ ను ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!

మహేష్ మాబు సినిమాలో థోర్ ను ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!

by Azhar
Ad
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు. అయితే మొదటి బాహుబలి సినిమా చేస్తున్న సమయంలో కేవలం సౌత్ సినిమా నటులతోనే సినిమా తీసాడు. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ నటులను పెట్టాడు రాజమౌళి. అలియా భట్, అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఉన్నారు.
అయితే ఇప్పుడు రాజమౌళి తన తర్వాతి సినిమా అనేది మహేష్ బాబుతో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో హిందీ నటులను ఉంచి.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అనేది తెచ్చుకున్నా రాజమౌళి.. ఇప్పుడు తన తర్వాతి సినిమాలో హాలీవుడ్ నటుడిని ఉంచాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
మహేష్ బాబుతో చేస్తున్న కొత్త సినిమాలో హాలీవుడ్ స్టార్ యాక్టర్ క్రిస్ హెమ్స్‌వర్త్ ను పట్టుకురావాలని రాజమౌళి ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. అయితే క్రిస్ హెమ్స్‌వర్త్ అంటే తీయడం కదటం కానీ.. మర్వెల్ సిరీస్ లో థోర్ పాత్రలో కనిపించే నటుడు అందరికి తెలుసు. అతనే ఈ  క్రిస్ హెమ్స్‌వర్త్. ఇతనికి థోర్ పాత్ర వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అనేది వేసిన విషయం తెలిసిందే. అలాంటి ఈ  క్రిస్ హెమ్స్‌వర్త్ రాజమౌళి సినిమాలో చేయడనికి ఒప్పుకుంటాడా.. లేదా అనేది చూడాల్సి ఉంది.

Advertisement

Visitors Are Also Reading