Home » ఈ వారం ఓటిటి, థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాలు ఇవే…!

ఈ వారం ఓటిటి, థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాలు ఇవే…!

by AJAY
Published: Last Updated on
Ad

ప్రతివారం ఓవైపు థియేటర్లలో మరోవైపు ఓటిటిలో కొత్త సినిమాల సందడి కనిపిస్తుంది. ఇక ఈ వారం కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి అటు ఓటిటిలో ఇటు థియేటర్లలో కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబుకు జోడిగా నటించింది. పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Advertisement

బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం జయేష్ భాయ్ జోర్దార్. ఈ చిత్రానికి దివ్యాంక్ టక్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మే 13న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కశ్మీరీఫైల్స్ సినిమా కూడా ఓటిటి విడుదలకు సిద్దం అవుతోంది. మార్చి 11న ఈ సినిమా జీ 5 లో అన్ని భాషల్లో అందుబాటులోకి రానుంది.

తమిళ స్టార్ విజయ్ పూజ హెగ్డే హీరో హీరోయిన్ లు నటించిన బీస్ట్ సినిమా కూడా ఓటిటి విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సినిమా కూడా మే 11న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

Visitors Are Also Reading