Home » TOLLYWOOD : ఈ వారం ఓటిటి, థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న భారీ చిత్రాలు…సినీల‌వ‌ర్స్ కు పండ‌గే!

TOLLYWOOD : ఈ వారం ఓటిటి, థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న భారీ చిత్రాలు…సినీల‌వ‌ర్స్ కు పండ‌గే!

by AJAY
Ad

ప్రతి వారం సినిమాలు కొత్త‌కొత్త సినిమాలు అటు థియేట‌ర్ లో మ‌రియు ఇటు ఓటీటీలో విడుదలవుతున్నాయి. కొత్త సినిమాలతో ప్రేక్షకులు స‌మ్మ‌ర్ ను కూల్ కూల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ వారం థియేటర్లలో మరియు ఓటిటిలో విడుదల అవుతున్న సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….


తమిళ స్టార్ హీరో విజయ్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన భారీ బ‌డ్జెట్ సినిమా బీస్ట్. ఈ సినిమా ఏప్రిల్ 13న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజిఎఫ్ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా కేజిఎఫ్-2 తెరకెక్కింది. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

bollywood jersy

bollywood jersy

తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన జెర్సీ సినిమాకు రీమేక్ గా బాలీవుడ్ లో జెర్సీని సినిమాను తెరకెక్కించారు. సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నారు.

ఇక ఈ వారం ఓటిటిలో శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల కాబోతుంది. ఏప్రిల్ 14న ఈ సినిమా సోనిలివ్ లో విడుదలవుతోంది. అదేవిధంగా ఎంఎక్స్ ప్లేయర్ లో దహనం సినిమా విడుదల కానుంది. అదేవిధంగా గా జి ఫైవ్ లో గాలివాన వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

 

Visitors Are Also Reading