ఆ రోజుల్లో రేలంగి మరియు రాజబాబు కమెడియన్లుగా చాలా మందికి తెలుసు. కానీ వీరికంటే ముందు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ ఉండేవారు ఆయన పేరే కస్తూరి శివరావు.. వరవిక్రయం అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో చాలా చిన్న వేషం వేశారు. చిన్న చిన్న పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న శివ రావు. ఆ రోజుల్లో ఒక్క సినిమాకు లక్ష రూపాయలు తీసుకునే రేంజ్ కు వచ్చారు. ఆయన అప్పట్లోనే ఖరీదైన కార్లు కొని తిరిగేవారు.
also read:అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన 12 సినిమాల్లో సగం బ్లాక్‌బస్టర్లే అనే విషయం మీకు తెలుసా ?
Advertisement
Advertisement
కానీ కొంతమంది తన చుట్టే ఉంటూ తాగుడుకు బానిస చేశారు. ఇక ఆయనతో సొంత సినిమాలను కూడా తీయించారు. దీంతో ఆయనకు ఉన్నదంతా పోయింది. ఈ విధంగా ఆస్తులు పోగొట్టుకున్న ఆయన అదే పాండీ బజార్ లో పాత సైకిల్ పై తిరగాల్సి వచ్చింది. తొలితరం హాస్య నటుల జాబితాలో ఈయన పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎంతోమంది మహా మహా నటులతో పోటీపడి మరీ నటించేవారు. అందుకే ఆయనంటే ఇండస్ట్రీలో మంచి పేరు ఉండేది.
ఈయన డేట్స్ కోసం ఆ రోజుల్లో దర్శకనిర్మాతలు వెయిట్ చేసేవారు. సినిమా పోస్టర్ పై శివరావు ఫోటో ఉందంటే తప్పకుండా చాలామంది ఈ సినిమా చూడ్డానికి వెళ్లేవారట. అంతటి కామెడీతో అందరిని అలరించే శివరావు చివరి రోజుల్లో మాత్రం చేతిలో చిల్లిగవ్వ లేక చాలా దుర్భరమైన పరిస్థితుల్లో తను పాత్రల కోసం ఎలా అయితే ఆ డొక్కు సైకిల్ పై తిరిగారో, చివరి రోజుల్లో కూడా అదే డొక్కు సైకిల్ మిగిలింది..
also read: