రికార్డ్స్ అనేవి ఎప్పుడూ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇక కొన్ని కొన్ని రికార్డ్స్‌కు మాత్రం ఎప్పటికీ ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉండదు. అవి ఎప్పటికీ శాశ్వతంగా మిగిలిపోతాయి. ఇక సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో చూస్తే ఎన్నో రికార్డులు సాధించిన చిత్రాలున్నాయి. దాదాపు 17 సినిమాలు టాప్ గ్రాసింగ్ గా నిలిచాయి. అవేంటో ఓసారి చూద్దాం…
ఎన్టీఆర్ 17సార్లు హీరో ఆఫ్ ది ఇయర్ అన్నమాట. ఒకే సంవత్సరంలో 7చిత్రాలు వంద రోజులు ఆడిన రికార్డ్ ఆయనకే సాధ్యం అని చెప్పాలి. 1965లో ఈ ఫీట్ సాధించారు. సూపర్‌స్టార్ కృష్ణగారితో ఈ రికార్డ్‌నిపంచుకున్నారు ఆయన. ఇక దానవీర సూరకర్ణ చిత్రం 1977, 1986, 1994లో మూడు సార్లు విడుదలై మూడుసార్లు కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్‌చేసి అబ్బుర పరిచాయి. లవకుశ మూవీ విడుదలై వంద రోజులు ఆడడం కూడా శాశ్వత రికార్డ్ అని చెప్పాలి. ఈ రికార్డును వెంకటేష్‌తో కలిసి పంచుకున్నారు ఎన్టీఆర్.
Advertisement
ఏఎన్నార్‌గారికి భారతదేశంలోనే ఎవ్వరికి లేనంత రికార్డ్ ఉంది. ఆయన ఖాతో 114 డైరెక్ట్ సినిమాలు వందరోజుల సినిమాలు ఉన్నాయి. అలాగే ఎనిమిది కేంద్రాల్లో ప్రేమాభిషేకం 300రోజులు ఆడిన చిత్రం. ఇది ఫుల్ రికార్డ్ అని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ ఫుల్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన హీరో ఏ ఎన్నార్. బాలరాజు, కీలుగుర్రం వంటి మంచి చిత్రాలు అందించారు. ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్‌తో టాలీవుడ్ అద్యధిక రికార్డ్ ఉన్నహీరోగా నిలిచిపోతారు.
కృష్ణ హీరోగా 324 చిత్రాల్లో నటించడం ప్రపంచ రికార్డ్. ఒకే సంవత్సరం 18 చిత్రాల్లో నటించిన ఏకైక హీరో కూడా ఆయనే. అలాగే ఒకేనెలలో రెండు సినిమాలు విడుదలైన రికార్డు ఇది 60సార్లు జరిగిన రికార్డు కూడా ఆయనదే. దిమ్మతిరిగే రికార్డు ఇది. ఒకే సంవత్సరంలో 7 డైరెక్ట్ వందరోజులు సినిమాల రికార్డ్ కూడా ఆయనదే.
Also Read: గుమ్మడి గింజలను తినడం వల్ల మహిళలకు ప్రయోజనాలు.. ఆ సమస్యకు చెక్
శోభన్‌బాబు ఒకేసంవత్సరం 1975లో హైదరాబాద్ సెంటర్‌లో నాలుగు వంద రోజుల చిత్రాలు సాధించారు. ఒకేసంవత్సరం 1975లో నాలుగు చిత్రాలు పది కేంద్రాల్లో వంద రోజులు ఆడిన రికార్డ్‌కూడా ఆయనదే. ఇక ఈ రికార్డ్ వెంకటేష్‌కి కూడా ఉంది.
Advertisement
ఇక చిరంజీవి అనగానే రికార్డు గుర్తుకువస్తుంది. ఆయనకు ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉండగా వాటిలో వరుసగా ఆరు సంవత్సరాలు1987 నుంచి 1992 వరకు ప్రతి సంవత్సరం ఇండస్ట్రీ హిట్ అందించారు. ఖైదీ నెం 150 నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. 100 సెంటర్లలో వందరోజులు ఆడిన చిత్రాలు చిరంజీవి లిస్ట్‌లో రెండు ఉన్నాయి. అది ఇంద్ర, ఠాగూరు.
బాలకృష్ణకి రెండు రికార్డులున్నాయి. ఒకేరోజు రెండు సినిమాలు విడుదలయితే అవి రెండూ రాజమండ్రిలో వందరోజులు ఆడడం పర్మనెంట్ రికార్డ్. అవి 1993లో విడుదలయిన బంగారుబుల్లోడు, నిప్పురవ్వ. అలాగే 70 సెంటర్లలో వందరోజులు ఆడిన సినిమాల రికార్డ్ కూడా బాలయ్యదే. సమరసింహారెడ్డి, నర్సింహనాయుడు, లక్ష్మీనరసింహ, సింహా ఆ నాలుగు సినిమాలు లెజండ్ మూవీ రెగ్యులర్ ట్రెండ్ కి భిన్నంగా ఉంటుంది.
నాగార్జునకి శివ ఒక పెద్ద రికార్డ్ అని చెప్పాలి. అది టాలీవుడ్‌లోనే ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసిన సినిమాగా శివ మిగిలిపోతుంది. ఆ తర్వాత పక్కరాష్ట్రంలో రెండు డబ్బింగ్ చిత్రాలు 150 రోజులు ఆడడం మరో రికార్డ్ అవి గీతాంజిలి, నిన్నే పెళ్ళాడతా. ఇక అన్నమయ్య ఆడియో సేల్స్ రికార్డ్ ఎప్పటికీ అలానే ఉంటుంది. నాగార్జునకి ఉన్న మరో అద్భుతమైన రికార్డ్ ఒకేసెంటర్‌లో అది వైజాగ్‌లో నాలుగు నాగార్జున సినిమాలే అది కూడా వందరోజులు శివ, నిన్నేపెళ్ళాడతా, గీతాంజలి, నువ్వువస్తావని చిత్రాలు.
వెంకటేష్ యాభై కేంద్రాలకు పైగా వందరోజుల చిత్రాలు ఏడు ఉన్న ఏకైక రికార్డ్ వెంకీకి మాత్రమే సొంతం. కలిసుందాంరా, రాజా, ప్రేమించుకుందాం రా, నువునాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి, లక్ష్మీ చిత్రా. కలిసుందాంరా…ఆరు సెంటర్లలో 150రోజులు ఆడింది. లవకుశమూవీతో కలిసి ఈ రికార్డ్ ఉంటుంది.
Also Read: Rahul ramakrishna : సినిమాలకు గుడ్ బై చెబుతున్నా..అర్జున్ రెడ్డి కమెడియన్ ప్రకటన..!
పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ ఏలూరు సత్యనారాయణ సెంటర్‌లో 150 రోజులు ఆడింది. అలాగే తన మొదటి 7 చిత్రాలు 100 రోజులు ఆడడం కూడా మరో రికార్డ్.
మహేష్‌బాబు హ్యాట్రిక్ ఫస్ట్ వీక్ హిట్ ఉన్న ఏకైక హీరో ఆయనే.
దూకుడు, బిజినెస్‌మ్యాన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. పోకిరి ఒకేసెంటర్‌లో 365 రోజులు ఆడిన చిత్రం అదే.