సౌత్ ఇండియాలోని ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే టాలీవుడ్ కు మార్కెట్ స్టామినా ఎక్కువ…అందుకే ఇతర భాషల్లోని హీరోయిన్స్ తెలుగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంటారు . ముఖ్యంగా మలయాలీ యాక్టర్స్ తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. అలా మలయాలం నుండి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం!
కీర్తి సురేష్ : సీనియర్ నటి మేనక కూతురైన కీర్తి 2016 లో నేను శైలజ సినిమాతో రామ్ సరసన హారోయిన్ గా నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నేను లోకల్ , అజ్ఞాతవాసి సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్స్ సరసన చేరింది.
Advertisement
అనుపమ పరమేశ్వరన్
మలయాలం ప్రేమమ్ సినిమాలో మేరీ పాత్రతో అదరగొట్టిన అనుపమకు తెలుగులో అఆ సినిమాలో అవకాశం దక్కింది.
నివేధా థామస్
నానీ జెంటిల్మెన్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నివేధా ఖాతాలో నిన్ను కోరీ, జైలవకుశ లాంటి హిట్ సినిమాలు పడ్డాయి.
Advertisement
మంజిమా మోహన్ :
కేరళ స్టేట్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్న మంజిమా… నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
మడోన్నా సెబాస్టియన్
మలయాలం ప్రేమమ్ లో నటించిన మడోన్నా ….తెలుగు ప్రేమమ్ లో కూడా అదే పాత్రలో నటించింది.
నమితా ప్రమోద్
మలయాలీ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నమితా తెలుగులో చుట్టాలబ్బాయి, కథలో రాజకుమారీ సినిమాల్లో నటించింది.
అను ఇమ్మాన్యుయేల్
మలయాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనూ…గోపిచంద్ ఆక్సీజన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.