Home » ఈ లేడీ ప‌వ‌ర్ స్టార్ కు క్రేజీ మామూలుగా లేదుగా.. ఆమె మైక్ ప‌ట్ట‌గానే ఓ రేంజ్ లో..!

ఈ లేడీ ప‌వ‌ర్ స్టార్ కు క్రేజీ మామూలుగా లేదుగా.. ఆమె మైక్ ప‌ట్ట‌గానే ఓ రేంజ్ లో..!

by Anji
Ad

తెలుగులో సాయి ప‌ల్ల‌వి ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆమె ఏదైనా సినిమా న‌టించిందంటే ఆ సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కు అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తూనే ఉంటారు. ఇక ఆమె త‌న‌దైన న‌ట‌న‌తో పాటు డ్యాన్స్ కూడా ఇర‌గ‌దీసే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లేడీస్ సూప‌ర్ స్టార్ గా ముద్ర‌ప‌డిపోయింది. ఆమె ఆఫ్ స్క్రీన్ బిహేవియ‌ర్, మాట్లాడే తీరుకు ఎంతో మంది ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఏమాత్రం అస‌లు ఎక్స్‌పోజింగ్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలో ఈవిధంగా కూడా రాణించ‌వ‌చ్చు అని నిరూపించింది సాయిప‌ల్ల‌వి.

Advertisement

ద‌గ్గుపాటి రానా స‌ర‌స‌న హీరోయిన్‌గా విరాట‌ప‌ర్వం సినిమాలో న‌టించింది సాయిప‌ల్ల‌వి. ఈ సినిమా ఈనెల 17న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న‌ది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ నిర్వ‌హించారు. ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విక్ట‌రీ వెంక‌టేష్ విచ్చేసిన‌ప్ప‌టికీ సాయిప‌ల్ల‌వినే స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. సాయిప‌ల్ల‌విని చూడ‌డానికి ఎంతో మంది అభిమానులు ప్ర‌త్యేకంగా వ‌చ్చారంటే ఈమెకు ఫాలోయింగ్ ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. సాయిప‌ల్ల‌వి మాట్లాడేందుకు మైక్ అందుకోగానే అభిమానులు ఒక్కసారిగా ఈల‌లు, కేక‌లు వేశారు. ఇక సాయిప‌ల్ల‌వి పేరు చెప్ప‌గానే అభిమానులు ఓ రేంజ్ లో ఊగిపోయారు. మాట్లాడుతున్నంత సేపు కేక‌ల‌తో మారుమ్రోగించారు. ఓ అభిమాని సాయి ప‌ల్ల‌వి పెయింటింగ్ వేసిన ఫోటోను ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం. సాయి ప‌ల్ల‌వి ఫ్లెక్సీల‌ను చూపిస్తూ సంద‌డి చేసారు.

Advertisement

సాయి ప‌ల్ల‌వి కూడా మాట్లాడేట‌ప్పుడు ఎంతో ఓర్పుగా మాట్లాడారు. స్పీచ్ మొత్తం దాదాపు తెలుగులోనే మాట్లాడి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. విరాట‌ప‌ర్వం సినిమాలో న‌టించిన ప్ర‌తి ఒక్క న‌టుడు, న‌టిపేరు చెప్పి మ‌రీ అంద‌రికీ ధ‌న్యావాదాలు తెలిపింది. ఇక అభిమానులు ఇంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్యూ వెరీమ‌చ్ అని చెప్పారు. జూన్ 17న ఈ సినిమా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని.. కొత్త ప్ర‌యోగాల‌ను మీరు ఆద‌రిస్తార‌ని చెప్పింది. ఈ సినిమాను త‌ప్ప‌కుండా చూస్తార‌ని ఆశిస్తున్న‌ట్టు చెప్పారు.

Also Read : 

మగధీర సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినా రాజమౌళి ఎందుకు హర్ట్ అయ్యాడు ? అల్లు అరవింద్ అలా చేశాడా ?

సార్ నా భార్యను అరెస్ట్ చేయండి.. పోలీస్ స్టేషన్ ముందు నిరసన.. కారణం ఏమిటంటే?

Visitors Are Also Reading