Home » ఈ ఫోటోలో ఉన్న‌ది పాన్ ఇండియా స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

ఈ ఫోటోలో ఉన్న‌ది పాన్ ఇండియా స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

by Anji
Ad

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చిన్న‌ప్ప‌టి ఫోటోలను షేర్ చేసే ట్రెండ్ కొన‌సాగుతుంది. సినీ, రాజ‌కీయ సెల‌బ్రెటీలు తమ చిన్న నాటి ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. టాలీవుడ్‌, బాలీవుడ్, నార్త్‌, సౌత్ తేడా లేకుండా అన్ని ఇండ‌స్ట్రీల సెల‌బ్రిటీల చిన్న‌నాటి పోటోలు ఈ మ‌ధ్య తెగ వైర‌ల్ అవుతున్నాయి. కొంద‌రు తార‌ల‌ను వారి చిన్న‌ప‌ట్టి ఫోటోల‌తో పోల్చి చూస్తే వారేనా కాదా అన్న‌ట్టు అనిపిస్తుంటుంది. ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్ లో ఎన్టీఆర్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్‌చ‌ర‌ణ్, అల్లుఅర్జున్‌, ప్ర‌భాస్ త‌దిత‌ర హీరోల ఫోటోలు వైర‌ల్ మారగా.. తాజాగా ఈ జాబితాలో మ‌రో హీరో చేరాడు. ప్ర‌స్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ హీరో చిన్న‌ప్ప‌టి ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

ఇక ఆ ఫోటో చూడ‌గానే ఫ‌లానా హీరో అని వెంట‌నే గుర్తు ప‌ట్ట‌డం చాలా క‌ష్టంగానే ఉందంటున్నారు అభిమానులు. ఇక ఈ ఫోటోలో ఉన్న ఈ బుడ్డోడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ముఖ్యంగా అమెరికాలో ఉన్న‌త చ‌దువులు చ‌దివాడు. సినిమాల మీద ఇష్టంతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. రోటీన్ చిత్రాల‌తో కాకుండ ఆవిభిన్న‌మైన క‌థాంశంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆ త‌రువాత కొన్ని చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా విల‌న్‌గా చేసి మెప్పించాడు. రాజ‌మౌళి చిత్రంలో కూడా న‌టించాడు. ఆ త‌రువాత హీరోగా విభిన్న‌మైన క‌థ‌లు ఎంచుకుని కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. తాజాగా పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి భారీ విజ‌యం అందుకున్నాడు. ఇంత‌కు ఆ స్టార్ హీరో ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  ఒక్క‌డు సినిమాలో మ‌హేశ్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

పైన ఫోటోలో పోలీస్ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా ఉన్న ఈ బుడ‌త‌డు మ‌రెవ్వ‌రో కాదండోయ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో అడివి శేషు. విభిన్న క‌థలు, పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడివి శేషు. ఇటీవ‌లే తాను న‌టించిన మేజ‌ర్ చిత్ర పాన్ ఇండియా మూవీగా విడుద‌లై అన్ని భాష‌ల్లో భారీ విజ‌యాన్ని అందుకుంది. ఈ చిత్రంలో మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ పాత్ర‌లో అడివి శేషు జీవించాడు. ఇక అత‌ని న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌స్తుతం అడివి శేషు చిన్ననాటి ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఇది కూడా చ‌ద‌వండి :  ఆ హీరోయిన్ సోద‌రుడితో ఇలియానా డేటింగ్‌ వాస్త‌వ‌మే..!

Visitors Are Also Reading