Home » న‌టుడు దావుద్ ఆ జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్ గురించి ఏమ‌న్నాడంటే..?

న‌టుడు దావుద్ ఆ జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్ గురించి ఏమ‌న్నాడంటే..?

by Anji
Ad

న‌టుడు దావుద్, జ‌బ‌ర్దస్త్ న‌టుడు దొర‌బాబు ఒకే విధంగా ఉండ‌టం తెలిసిన విష‌య‌మే. అయితే వీరిద్ద‌రూ క‌లిసి ఒక‌ప్పుడు హైప‌ర్ ఆది స్కిట్‌లో క‌వ‌ల సోద‌రులుగా కూడా న‌టించారు. విశాఖ‌లో జ‌రిగిన ఓ రైడ్‌లో దొర‌బాబు జైలుకెళ్లాడ‌నే వార్త అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా దావుద్ ఓయూట్యూబ్ చానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ముఖ్యంగా క‌లిసిన ప్ర‌తి కొత్త వ్య‌క్తికి నేను దొర‌బాబు కాదు అనే స‌మాధానం చెప్పుకోవాల్సి వ‌స్తుంది. నేను, దొర‌బాబు ఒకే విధంగా ఉండ‌టంతో నేను వెళ్లిన ప్ర‌తి కొత్త చోటుకు కొత్త‌గా స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుంది.

Also Read :  DJ TILLU REVIEW : మోత‌మోగుతున్న “డీజే టిల్లు”..సినిమా ప్ల‌స్లు మైన‌స్లు ఇవే.. ! 

Advertisement

ముఖ్యంగా ఎవరినీ ఎక్క‌డ త‌ప్పుగా మాట్లాడ‌లేదు. ప్ర‌తి సారి రిక్వెస్ట్ చేశాను. ఎందుకో నా రిక్వెస్ట్ ఆక్సెప్ట్ అవ్వ‌డం లేదు. జ‌బ‌ర్ద‌స్త్ శ్రీ‌ను అన్న నాకు చాలా హెల్ప్ చేశారు. నా ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి నాకు కొంత స‌హాయం చేశారు. ప్ర‌యివేటుగా చిన్న వీడియో లాంటిది చేసి ఇది కాదు కొంచెం అర్థం చేసుకోండి అని, ఇలా జ‌రుగుతుంద‌ని ఆ వ్య‌క్తి చెబితే చాలా బాగుంటుంది. హైప‌ర్ ఆది వ‌ల్ల దొర‌బాబు అంద‌రికీ తెలుసు. హైప‌ర్ ఆది అన్న కొంచెం చొరువ తీసుకొని మ‌నోడికి ఏదైనా చేద్దామ‌నుకుంటే మాత్రం అది నిమిషాల్లో ప‌ని అని చెప్పారు.

Advertisement

దీని వ‌ల్ల‌ ఎవ‌రికీ న‌ష్టం ఏమి లేదు. కానీ నాకు కొంచెం మాన‌సిక ప్ర‌శాంత‌త అనేది లేకుండా పోతుంద‌ని దావుద్ పేర్కొన్నారు. త‌న‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రూ జ‌బ‌ర్ద‌స్త్ కోసం ఇలా మాట్లాడుతున్నార‌ని, మరికొంద‌రూ అత‌ను అలాంటోడు, ఇలాంటోడు అని సోష‌ల్ మీడియాలో తిడుతున్నారు. ఆది ప్ర‌తి స్కిట్‌లో దొర‌బాబుపై పంచ్‌లు వేయ‌డం మూలంగానే ఆ విష‌యాల‌ను గుర్తుకు చేయ‌డంతో.. మీ ఇద్ద‌రికీ పోలిక‌లు క‌లిసి ఉండ‌టంతో అలా జ‌రుగుతుంద‌నుకోవ‌చ్చా..? అని మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు దావుద్ ఇలా స‌మాధానం ఇచ్చాడు.

మేము ఇద్ద‌రం ఒకే విధంగా ఉండ‌టం త‌ప్పు కాదు. అది దేవుని గొప్ప‌త‌నం. నేను ముస్లిం, తాను హిందువు అయినా ఒకే విధంగా ఉన్నామంటే కార‌ణం దేవుడి గొప్ప‌త‌న‌మే అని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా నేను వెళ్లినా ప్ర‌తిచోటా విశాఖ‌లో జ‌రిగిన టాపిక్ మాట్లాడ‌టం నాకు న‌చ్చ‌డం లేదు. జ‌బ‌ర్ద‌స్త్ ఆడియ‌న్స్‌, వ్యూయ‌ర్స్ కు స‌మాధానం చెప్పుకుంటే స‌రిపోతుంది. ఓన్లీ జ‌బ‌ర్ద‌స్త్ ఆడియ‌న్స్‌తోనే నాకు పెద్ద ప్రాబ్లం. ఆది అన్న నేను ఇంత పెద్ద ప్రాబ్లం ఎదుర్కుంటున్నాను. న‌న్ను కొత్త‌గా చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుంది. నా ప్రాబ్లం మీ వ‌ల్ల‌నే సాధ్య‌మ‌వుతుంది అని చెప్పారు దావుద్‌. లేదంటే ప్రాబ్లానికి వేరే రాష్ట్రం వెళ్లిపోవాల‌నిపిస్తుంద‌ని త‌న స‌మ‌స్య ఇలా చెప్పారు.

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారు అదృష్ట‌వంతులు అవుతారు

Visitors Are Also Reading