Home » బాలయ్య గోపీచంద్ మలినేని టైటిల్ ఇదే..!

బాలయ్య గోపీచంద్ మలినేని టైటిల్ ఇదే..!

by Anji
Ad
ఓ వైపు క్రాక్ సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ అందుకున్న గోపీచంద్ మలినేని… ఒకవైపు అఖండ విజయంతో దూసుకెళ్లిన నందమూరి బాలకృష్ణ వీరిద్దరి కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చివరగా సినిమా పేరు అన్నగారు అనే టైటిల్ ను ఖరారు చేసినట్ల సమాచారం. 
టైటిల్కు యూనిట్ సభ్యులు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాకు వీర సింహారెడ్డి అనే టైటిల్ వినిపించిన ఆ టైటిల్ రొటీన్‌గా ఉందని కామెంట్స్ వచ్చాయి. ఆశ్రమంలో బాలకృష్ణకు జంటగా శృతిహాసన్ నటిస్తోంది. సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. బాలకృష్ణ తండ్రి నందమూరి తారకరామారావు అందరూ అన్నగారు అని పిలిచేవారు. ఈ సినిమా కూడా అదే టైటిల్ పెట్టడంతో తండ్రి పేరు బాలయ్య వచ్చే విధంగా పెట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నగారు అనే టైటిల్ ను బాలయ్యకు బాగా సూట్ అవుతుందని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. 
అత్యంత త్వరలోనే ఈ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అఖండ సినిమాలో తొలి అక్షరం నా కాగానే ఈ సినిమా తొలి అక్షరం కూడా ఆ తోనే మొదలు కావడం విశేషం. అఖండ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిన గోపీచంద్ మలినేని ఈ సినిమా కూడా అదే సక్సెస్ సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. గోపిచంద్ మలినేని సినిమాతో పాటు బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా మరొక సినిమా ఓకే చెప్పాడు. చిత్రం కూడా రెగ్యులర్ షూటింగ్‌కి సంబంధించి త్వరలోనే క్లారిటీ రానున్నది. 

Advertisement

Visitors Are Also Reading