సాధారణంగా ఏ రంగంలోనైనా పని చేసే వారికి కాస్త టాలెంట్ తో పాటు అదృష్టం కూడా వరించాలి. సినీ పరిశ్రమలో అయితే అదృష్టం కాస్త ఎక్కువనే ఉండాలి. అదేవిధంగా ముందుచూపు కూడా బాగానే ఉండాలి. ఎందుకంటే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా సెట్ చేసుకొని రెడీగా ఉంటేనే సినీ ఇండస్ట్రీలో రాణించగలరు. లేకుంటే మరో సినిమా చేయడానికి చాలా సమయం పడుతుంది. ఆ దర్శకుడు ఎంత పెద్ద హిట్ ఇచ్చినా కూడా చివరికీ హిట్ వేడి వెంటనే చల్లారిపోతుంది. మన స్టార్ హీరోలు అందుకే వరుస సినిమాలను ఒప్పుకుంటుంటారు. హీరోలతో పాటు దర్శకులు కూడా దాదాపు రెండేళ్ల వరకు తిరుగులేకుండా చూసుకుంటారు.
Advertisement
ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ దర్శకుడే ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సాన. ఆ సినిమాతో ఆయన వంద కోట్ల క్లబ్ లో కూడా అడుగుపెట్టాడు. కానీ ఇక ఆ తరువాత ఏ సినిమాని కూడా ప్రారంభించలేదు. చాలా రోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చుట్టూ తిరిగాడు. కానీ అనూహ్యంగా ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాని వద్దని చెప్పాడు.
Advertisement
తాజాగా బుచ్చిబాబు కథ నచ్చి తనతో ఓ సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు శంకర్ తో చేస్తున్న మూవీ పూర్తి కాబోతుంది. శంకర్ సినిమా పూర్తవ్వగానే రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. చరణ్ తో చేసే సినిమా కథ ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. రామ్ చరణ్ పిజిక్ అథ్లెట్ మాదిరిగా ఉంటుంది కాబట్టి ఈ చిత్రానికి అతను పర్ ఫెక్ట్ గా సూట్ అవుతాడు అని బుచ్చిబాబు భావిస్తున్నాడట. ఈ సినిమా పట్టాలపైకి ఎక్కుతుందో లేదో మరికొద్ది రోజులు వేచి చూడాలి.
Also Read : అర్జున్ రెడ్డి సినిమాలో శివ పాత్రకు ఫస్ట్ చాయిస్ రాహుల్ రామకృష్ణ కాదంట.. మరి ఎవరంటే ?