వన్డే వరల్డ్ కప్ 2023 కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ఏడాది లోనే వన్డే వరల్డ్ కప్ మన ఇండియాలో జరగనుంది. ఇలాంటి తరుణంలో వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ ను ఐసీసీ ఇవాళ రిలీజ్ చేసింది. ఐసీసీ రిలీజ్ చేసిన వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ ప్రకారం…. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ ఇండియాలో జరగనుంది. 10 సంవత్సరాల తర్వాత ఇండియాలో ఈ టోర్నమెంట్ జరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ గ్రౌండ్స్ లో ఈ మ్యాచ్లు నిర్వహించేలా ఐసీసీ ప్లాన్ చేసింది.
Advertisement
ఇలాంటి తరుణంలోనే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా మ్యాచ్ లేకుండానే ఈసారి వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ గ్రౌండ్లో మూడు మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో రెండు మ్యాచ్లు పాకిస్తాన్…. క్వాలిఫైయర్ టీమ్స్ తో ఆడనుంది. ఆటో న్యూజిలాండ్ కూడా ఒక క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది. కానీ టీమిండియా మాత్రం హైదరాబాదులో ఒక్క మ్యాచ్ కూడా ఆడటం లేదు. అయితే హైదరాబాద్ లో టీమిండియా మ్యాచ్లు నిర్వహించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
Advertisement
అందులో ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెత్త ప్రవర్తన కారణం. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ సమయంలో అలాగే ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్ ల నిర్వహణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దారుణంగా అట్టర్ ఫ్లాఫ్ అయింది. దీనివల్లనే టీమిండియా మ్యాచ్ ను హైదరాబాద్ లో నిర్వహించడం లేదు ఐసీసీ. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటు వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ లో ప్రారంభం కానుంది. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… సెక్యూరిటీ ఇవ్వలేమని తెలంగాణ పోలీసులు బీసీసీఐకి తేల్చి చెప్పినట్లు సమాచారం. అటు ఎన్నికలు ఇటు వరల్డ్ కప్ మ్యాచ్లకు సెక్యూరిటీ ఇవ్వడం చాలా కష్టమవుతుందని పోలీసులు చెప్పారట. ఈ కారణాలవల్లే హైదరాబాద్ లో టీమిండియా మ్యాచ్లు జరగడం లేదని టాక్.
ఇవి కూడా చదవండి
Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?
వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు