Home » రేవంత్ రెడ్డి విషయంలో ఆరోజు కేసీఆర్ అలా చేసి ఉండకుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదేమో..!

రేవంత్ రెడ్డి విషయంలో ఆరోజు కేసీఆర్ అలా చేసి ఉండకుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదేమో..!

by Anji
Ad

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు మొత్తం 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడు. వాస్తవానికి తాను స్టూడెంట్ దశలో ఏబీవీలో పని చేశారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలోనే చేరారు. దాదాపు మూడేళ్ల పాటు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఎదురు చూశాడట. రేవంత్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో చాలా నిరాశ పడ్డాడట.

Advertisement

ఇక అంతటితో  ఆగిపోకుండా బయటకి వచ్చి సొంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఓ ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. సాధారణ స్థాయి నుంచి సీఎం పదవి దాకా కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి కనిపించారు. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనగలిగే సత్తా ఉన్న నేతగా రేవంత్ రెడ్డి నిలిచారు. ఒకప్పుడు ఆయన కెరీర్ ప్రారంభంలో కేసీఆర్ నిర్ణయం కోసం చాలానే ఎదురు చూసారు. 2004 లో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చే టికెట్ కోసం ఆశగానే ఎదురు చూసారు.

Advertisement

ఇక ఆ సమయంలో కేసీఆర్ రేవంత్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఉంటే.. ఈరోజు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారి ఉండేవాడు కాదేమో అని పలువురు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా వైవిధ్యంగా కొనసాగింది. కేసీఆర్ నిర్ణయం కోసం వెయిట్ చేసి చేసీ విసుగు చెందిన రేవంత్ రెడ్డి స్వతంత్రంగానే పోటీ చేసి..  ప్రస్తుతం సీఎం పదవీ బాధ్యతలు చేపట్టాడు. 1992లో రేవంత్ రెడ్డి ఏబీవీపీలో యాక్టివ్ గా ఉండేవారు. తొలుత టీడీపీ పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి.. 2001-02 మధ్యలో టీఆర్ఎస్‌లో పని చేశారు. రేవంత్ తన రాజకీయ ప్రస్థానం ఆదిలోనే కొన్ని ఎత్తుపల్లాలను చూశారు. 2004లో కల్వకుర్తి టికెట్ వస్తుందని రేవంత్ ఆశించినా.. చివరికి ఆయనకు నిరాశే మిగిలింది.

అలాగే 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ తనకు టికెట్ వస్తుందని భావించినా.. అది కూడా అందని ద్రాక్షే అయింది. ఇక 2008లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి.. అద్భుత విజయాన్ని అందుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పేరు విపరీతంగా మారుమ్రోగింది. 2008లో మళ్లీ  టీడీపీలో చేరిన రేవంత్ రెడ్డి.. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై భారీ విజయం సాధించారు. ఆయన 2014లో కూడా మరోసారి గుర్నాథరెడ్డిని ఓడించి.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్‌రెడ్డి 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా పని చేశారు. ఇక తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి సీఎం స్థాయికి ఎదిగాడు రేవంత్ రెడ్డి.

Visitors Are Also Reading