Home » వావ్‌.. ప‌దేళ్ల బాలుడు తండ్రి వ్యాపారాన్ని ఎలా ప్ర‌మోట్ చేశాడంటే..?

వావ్‌.. ప‌దేళ్ల బాలుడు తండ్రి వ్యాపారాన్ని ఎలా ప్ర‌మోట్ చేశాడంటే..?

by Anji
Published: Last Updated on
Ad

ఏదైనా ఓ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ప్ర‌చారం చాలా అవ‌స‌రం. ప్ర‌మోష‌న్‌లు లేక‌పోవ‌డంతో వ్యాపారంలో చాలా నష్టాలు చ‌విచూసిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ప్ర‌స్తుతం ఏదైనా ప్ర‌మోష‌న్‌ల‌కు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌, ప‌బ్లిక్ యాక్టివ్‌గా ఉన్న ఇత‌ర సోష‌ల్ మీడియాలో మంచి స్పంద‌న ల‌భిస్తుంది.

Advertisement

అయితే హైద‌రాబాద్ న‌గ‌రంలోని బోర‌బండకు చెందిన ప‌దేళ్ల బాలుడు మ‌హ్మ‌ద్ అద్నాన్ త‌న తండ్రి హ‌లీమ్‌ను త‌యార చేస్తున్న వీడియోను రికార్డు చేసి.. దానిని ఎలా త‌యారు చేస్తున్నాడో కూడా అందులో వివ‌రించాడు. దానిని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. అంత‌కు ముందు రోజుకు 10 ప్లేట్ల హ‌లీమ్‌ను అమ్మ‌డం తండ్రికి క‌ష్టంగా ఉండేది.

అద్నాన్ తండ్రి వ్యాపార ప్ర‌మోష‌న్‌ను సోష‌ల్ మీడియాలోకి తీసుకెళ్ల‌డంతో బోర‌బండ‌లోని ప‌ప్పాకి హ‌లీమ్ దుకాణానికి జ‌నం పోటెత్తుతున్నారు. మ‌హ్మ‌ద్ అద్నాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంత‌కు ముందు క‌నీసం 10 ప్లేట్ల హ‌లీమ్ అమ్మేందుకు తండ్రికొడుకులు రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు వేచి చూడాల్సి వ‌చ్చేద‌ని.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఫ‌లితంగా రోజుకు 150 నుంచి 200 ప్లేట్లు అమ్ముడుపోతున్నాయ‌ని తెలిపారు.

Also Read :

  1. ఈ రాశి వారు తెలివిలో సూప‌ర్‌.. ప్ర‌తి విష‌యాన్ని లోతుగా ఆలోచిస్తారు
  2. KGFలో అందుడిగా నటించిన తాత ఎవరో తెలుసా….ఆయన బ్రాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు….!
Visitors Are Also Reading