Telugu News » Blog » ఈ క్యూట్ పాప హీరోయిన్ కాదు, ఒక స్టార్ హీరో వైఫ్.. ఎవరో చెప్పండి..?

ఈ క్యూట్ పాప హీరోయిన్ కాదు, ఒక స్టార్ హీరో వైఫ్.. ఎవరో చెప్పండి..?

by Sravanthi Pandrala Pandrala
Ads

ఈ మధ్యకాలంలో కొంతమంది స్టార్ సెలబ్రిటీల యొక్క చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పుకోండి అనే టాస్కులు ఇస్తున్నారు. ఈ విధంగానే ఒక క్యూట్ పాప ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో ముద్దుగా కనిపించే ఈ క్యూట్ పాప స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో ఒక్క సినిమా చేసినప్పటికీ మంచి పేరు తెచ్చుకుంది. చాలామందికి ఫేవరెట్ హీరోయిన్ అయింది.

Advertisement

also read;జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరు.. ఆమె రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్..!!

తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఒక స్టార్ హీరో ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఒక పాపకు తల్లి కూడా అయింది. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకోవాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎవరో మీరు గుర్తుపట్టండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు సయేషా సైగల్ .. బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ సైరా భానుల మనవరాలు. ఇకపోతే అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైన అఖిల్ సినిమాతో సయేషా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమెకు టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీలోకి షిఫ్ట్ అయింది.

Advertisement

అక్కడ లక్కు కలిసి వచ్చింది. స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యతో కొన్ని సినిమాలు చేసింది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న టైం లోనే ప్రేమ పుట్టింది. 2019లో వివాహం ద్వారా ఒకటయ్యారు. సర్ పట్టా,పరంపర సినిమాతో గత సంవత్సరం హిట్ కొట్టిన ఆర్య.. తాజాగా కెప్టెన్ మూవీ తో ప్రేక్షకుల్ని పలకరించారు. జానార్ కథతో తీసిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు అని చెప్పవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఆర్యా సయోషా దంపతులకు ఒక పాప కూడా ఉంది. వివాహం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సయేషా సైగల్ రీ ఎంట్రీ కి సిద్ధమవుతోంది.

Advertisement

also read;ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోనున్న విశాల్.. ఇంతకి ఆమె ఎవరంటే ?