Telugu News » Blog » “బింబిసార” సినిమాలో నటించిన ఈ బాలనటి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

“బింబిసార” సినిమాలో నటించిన ఈ బాలనటి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

గత కొన్ని నెలల నుంచి బింబిసార మూవీ సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ తెచ్చుకుంది. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాలో కేథరిన్ థెరిస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించగా, క్రీస్తుపూర్వం త్రిగర్త రాజ్యాన్ని పాలించిన బింబిసారుడి కథను బేస్ చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా వశిష్ఠ అనే డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

 

శుక్రవారం రోజున రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో చిన్న పాప చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆమె పేరు శ్రీదేవి. అయితే ఈ చిన్నారికి ఇదే తొలి మూవీ అయితే కాదు. ఇంతకు ముందు చాలా సినిమాల్లో నటించింది. మేజర్, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలే కాకుండా పలు సీరియల్స్ లో కూడా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేసింది. అయితే ఈమె తండ్రి శ్రీహరి గౌడ్ కూడా ఆర్టిస్ట్ గా మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పనిచేస్తున్నాడు.

Advertisement

 

అయితే ఈ చిన్న పాప ఇప్పటి వరకు 15 సీరియల్స్ లో, 10 యాడ్స్ లో నటించింది. అయితే బింబిసారలో మాత్రం శాంభవి పాత్ర లో నటించి మెప్పించింది. ఈమె నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు. ముద్దు ముద్దు మాటలతో క్యూట్ గా ఉండే ఈ చిన్నారి తన అభినయంతో అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు.

Advertisement

also read:

You may also like