Home » senior actor jhansi: ఒకప్పుడు రాణిలా బతికిన ఈ నటి.. ఇప్పుడు ఒంటరి అయింది.. కారణం..!!

senior actor jhansi: ఒకప్పుడు రాణిలా బతికిన ఈ నటి.. ఇప్పుడు ఒంటరి అయింది.. కారణం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీలో కొత్తనీరు వస్తుంటే పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగానే కొత్త యాక్టర్లు వచ్చిన కొలది పాత యాక్టర్లు కనుమరుగవుతూ ఉంటారు. ఇదంతా కామనే అయినా కొంతమంది యాక్టర్లు మాత్రం ఒక్కసారిగా బాగా పేరు తెచ్చుకొని అంతే స్పీడుగా మళ్లీ కనబడకుండా పోతారు. ఆ విధంగా ఇండస్ట్రీలో ఒకప్పుడు రాజ భోగాలు అనుభవించి ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఒంటరిగా బతుకుతోంది. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తన కెరీర్ లో వందల సినిమాల్లో నటించింది.

Advertisement

also read:స్టూడెంట్ నం.1 చిత్రాన్ని మిస్‌ చేసుకున్న స్టార్‌ హీరో..అతని ఫోన్‌ కాల్‌తో హీరో మారిపోయాడట!

Advertisement

నిర్మాతగా కూడా చేసింది. మరి ఆ నటి ఎవరయ్యా అంటే జి.ఝాన్సీ.. 1970-80లలో ఏఎన్ఆర్,ఎన్టీఆర్ లతో పాటు ఎందరో సీనియర్ నటులతో కీలక పాత్రలు చేసింది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు రాణిలా బ్రతికిన ఝాన్సీ తను సంపాదించిన ఆస్తులన్నీ పోగొట్టుకొని చివరికి ఏమీ లేక ఒంటరిదయిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను బయట పెట్టింది.

తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలియజేసింది. ప్రస్తుతం హైదరాబాదులో అద్దె ఇంట్లో ఉంటూ ఒంటరి జీవనాన్ని కొనసాగిస్తున్నానని తెలియజేసింది. చెన్నైలో ఉన్నప్పుడు బాగా సంపాదించాలని హైదరాబాద్ వచ్చాక సినిమాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయానని చెప్పింది. ప్రస్తుతం నెల ఇంటి అద్దెతో పాటు ఇల్లు గడవడం కూడా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది..

also read:

Visitors Are Also Reading