Home » నటుడు చంద్రమోహన్ సినీ జీవితం లో మీకు తెలియని విషయాలు..! అతనితో నటించిన హీరోయిన్స్ అందరూ..!

నటుడు చంద్రమోహన్ సినీ జీవితం లో మీకు తెలియని విషయాలు..! అతనితో నటించిన హీరోయిన్స్ అందరూ..!

by Anji

మామూలుగా సినీ ఇండ‌స్ట్రీలో హీరోల‌కంటే హీరోయిన్ల‌కే తొంద‌ర్లో స్టార్‌డ‌మ్ వ‌స్తుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక హీరోలు స్టార్ హీరోలుగా మారి నిల‌దొక్కుకోవాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సిందేన‌ని అంటున్నారు సినీ విశ్లేష‌కులు. సీనియ‌ర్ హీరో చంద్ర‌మోహ‌న్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. సీనియ‌ర్‌ చంద్ర‌మోహ‌న్‌తో క‌లిసి న‌టించిన ఎంతో మంది హీరోయిన్లు ఆ త‌రువాత కాలంలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే అగ్ర‌తార‌లుగా ఓ వెలుగు వెలిగారు. కానీ చంద్ర‌మోహ‌న్ మాత్రం ఎందుకో తెలియ‌దు కానీ స్టార్ హీరో కాలేక‌పోయాడనే చెప్ప‌వ‌చ్చు. చంద్ర‌మోహ‌న్ తో క‌లిసి న‌టించి ఆ త‌రువాత స్టార్ హీరోయిన్లుగా మారిన క‌థానాయిక‌లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.


1976లో క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సిరిసిరిమువ్వ‌లు సినిమాలో జ‌య‌ప్ర‌ద‌ న‌టించింది. ఇక ఈ సినిమాలో హీరో చంద్ర‌మోహ‌న్ కావ‌డం విశేషం. ఈ చిత్రం త‌రువాత జాక్పాట్ కొట్టింది జ‌య‌ప్ర‌ద‌. ఎన్టీఆర్ స‌ర‌స‌న అడ‌వి రాముడు, య‌మగోల‌, సినిమాల‌కు అవ‌కాశం ద‌క్కించుకుంది. అదేవిధంగా 1978లో ప‌ద‌హారేళ్ల వ‌య‌సు సినిమాలో కూడా చంద్ర‌మోహ‌న్-శ్రీ‌దేవి జంట‌గా న‌టించారు. ఈ సినిమా మంచి విజ‌యాన్నే సాధించింది. శ్రీ‌దేవి ఆ త‌రువాత వేట‌గాడు, కొండ‌వీటి సింహం, జ‌స్టిస్ చౌద‌రి, ప్రేమాభిషేకం, బెబ్బులిపులి ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ హీరోల సినిమాల్లో చాలానే న‌టించింది శ్రీ‌దేవి.

1978లో చంద్ర‌మోహ‌న్, జ‌య‌సుధ జంట‌గా క‌లిసి ప్రాణం ఖ‌రీదు సినిమాలో న‌టించారు. ఆ త‌రువాత ప‌లు సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ.. జ‌య‌సుధ తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 1983లో తెర‌కెక్కిన పెళ్లి చూపులు సినిమాలో చంద్ర‌మోహ‌న్ విజ‌య‌శాంతి క‌లిసి న‌టించారు. వీరి కాంబోలో వ‌చ్చిన ప్ర‌తిఘ‌ట‌న కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. ఇక ఆ త‌ర‌వాత విజ‌య‌శాంతి శోభ‌న్‌బాబు, నాగేశ్వ‌ర‌రావు, చిరంజీవి లాంటి స్టార్ హీరోల‌తో న‌టించింది. కానీ చంద్ర‌మోహ‌న్ మాత్రం స్టార్ హీరో కాలేక‌పోయాడు.

Also Read : 

బ్రహ్మం గారి కాలజ్ఞానం మరో సారి నిజమైందా ? నేపాల్ లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసా ?

బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. వీరంద‌రూ ఎవ‌రు..?

Visitors Are Also Reading