Home » సూర్య గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు చేయకూడని పనులు ఏంటో తెలుసా..?

సూర్య గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు చేయకూడని పనులు ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం సమయంలో ప్రతికూల శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇది శుభ పరిణామం కాదని చెబుతూ ఉంటారు. అందువల్లనే సూర్యగ్రహణం రోజున కొన్ని పనులను చేయకూడదని వారు అంటుంటారు. సూర్యగ్రహణం అనేది ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్లకూడదని చెబుతూ ఉంటారు.

Advertisement

also read:నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని కనాలి అని ఎందుకు అనుకున్నారంటే ? వెనక పెద్ద స్టోరీ నే ఉంది !

ఎందుకంటే పుట్టబోయే బిడ్డ పై చెడు ప్రభావం పడుతుందని నమ్ముతారు. సూర్యగ్రహణం సమయంలో అనేక కిరణాలు ఉద్భవిస్తాయి. ఈ హానికరమైన తరంగాలు పుట్టే బిడ్డ పై కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తాయని, అందుకే గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండాలని అంటుంటారు. అంతేకాకుండా గ్రహణం సమయంలో వీలైనంత వరకు ఏమీ తినక పోవడం, ఏ పని చేయక పోవడం, నిద్రపోకపోవడం మంచిదని చెబుతూ ఉంటారు. ఈ ఏడాది దీపావళి రోజున పాక్షిక సూర్యగ్రహణం వచ్చే అవకాశం ఉంది.

Advertisement

కాబట్టి ఈనెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటల ఆరుగంటల 30 నిమిషాల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతుందని అంటున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అదేరోజు దీపావళి సెలవులు కూడా ప్రకటించింది. ఆరోజు అమావాస్య వెళ్ళిపోయి పాడ్యమి వస్తుంది. అమావాస్య ఘడియలు లేకుంటే దీపావళి జరుపుకోవడం సబబు కాదని జ్యోతిష్యులు అంటున్నారు. 24వ తేదీన లక్ష్మీ పూజ చేసుకొని పండుగ జరుపుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:టాలీవుడ్ లోకి బాగ్య శ్రీ ఎంట్రి.. హీరో ఎవ‌రో తెలుసా ?

Visitors Are Also Reading