Home » పెళ్లయిన మహిళలు ఈ తప్పులు చేస్తే.. భర్త జీవితం నాశనం అవుతుందట!

పెళ్లయిన మహిళలు ఈ తప్పులు చేస్తే.. భర్త జీవితం నాశనం అవుతుందట!

by Bunty
Ad

పెళ్లి అంటే నూరేళ్ళ పంట. ఇది మన పెద్దలు చెప్పే మాట. ఒక్కసారి పెళ్లి అయితే భార్యాభర్తలు ఇద్దరు చివరి వరకు కలిసిమెలిసి ఉండాలి. ఒకరు గొడవ చేసిన మరొకరు… ఓపిక పట్టి జీవితాన్ని ముందుకు సాగించాలి. అయితే పెళ్లయిన మహిళలు… తమ జీవితంలో కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆ తప్పులు చేస్తే తమ భర్త జీవితం నాశనం అవుతుందట. మరి పెళ్లయిన మహిళలు ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఈ రంగు బట్టలు వేసుకోకూడదు :

పెళ్లయిన మహిళలు కచ్చితంగా శుభ కార్యాలయాలలో నలుపు మరియు నీలం రంగు బట్టలను అస్సలు ధరించకూడదట. అలాగే ఈ రంగు కల గాజులు కూడా వేసుకోకూడదట. ఎర్ర లేదా గ్రీన్ కలర్ సారీ కట్టుకుంటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

పగిలిన గాజులు :

పెళ్లైన మహిళలు అస్సలు పగిలిన గాజులు వేసుకోకూడదట. అలా పగిలిన గాజులు వేసుకుంటే ఆమె భర్తకు చెడు జరుగుతుందట. ఏదైనా పెను ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉంటాయట.

Advertisement

మెట్టెలు :

పెళ్లయిన సమయంలో మహిళలు మెట్టెలు ధరిస్తారు అన్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత ప్రతిరోజు మెట్టెలు పెట్టుకోవాలట. ఒకవేళ పెట్టుకోకపోతే భర్త ఆయుష్ తగ్గుతుందట. స్త్రీలు ఒక రౌండు లేదా రెండు గుండ్రటి మెట్టలను అస్సలు ధరించకూడదట. రెండు కంటే ఎక్కువ రౌండ్లు ఉన్న గుండ్రని మెట్టెలు ధరించాలట.

భర్తకు అవమానం :

పెళ్లయిన తర్వాత భర్తకు మంచి గౌరవం ఇవ్వాలట. తన భర్తతో మర్యాదపూర్వకంగా లైఫ్ లాంగ్ ఉండాలట. అప్పుడే భార్యాభర్తల జీవనం ముందుకు సజావుగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading