Home » ఐపీఎల్‌లో ఈసారి వారికి నిరాశే..అమ్ముడు పోని ఆట‌గాళ్లలో ముందు..?

ఐపీఎల్‌లో ఈసారి వారికి నిరాశే..అమ్ముడు పోని ఆట‌గాళ్లలో ముందు..?

by Bunty
Published: Last Updated on

ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా చూస్తుంటారు. 2022 సీజ‌న్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నుంది. ఈ సంవ‌త్స‌రం నూత‌నంగా రెండు జ‌ట్లు వ‌చ్చి చేర‌డంతో మొత్తం10 టీమ్‌లు అయ్యాయి. దీంతో క్రీడాభిమానుల‌కు ఈ స‌మ్మ‌ర్‌లో నాన్ స్టాఫ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఉండ‌బోతుంది.

కొత్త జ‌ట్ల‌లో అహ్మ‌దాబాద్ బేస్ ప్రాంఛైజీని సీవీసీ క్యాపిట‌ల్స్ 5265 కోట్ల‌కు ద‌క్కించుకోగా.. ల‌క్నో బేస్‌టీమ్‌ను 7090 కోట్ల‌కు గోయెంక గ్రూపున‌కు చెందిన ఆర్‌పీఎస్‌జీ సొంతం చేసుకుంది. మెగా వేలానికి ముందు కీల‌క రిటెన్ష‌న్ ప్ర‌క్రియ ముగిసింది. టీమ్‌కు న‌లుగురిచొప్పున 32 మందికి అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ 8 టీమ్‌లు క‌లిపి 27 మంది ప్లేయ‌ర్ల‌ను మాత్ర‌మే అంటిపెట్టుకున్నాయి. కొత్త‌గా వ‌చ్చిన జ‌ట్లు డిసెంబ‌ర్ 25 లోపు పిక్ అప్ ఆప్షన్ కింద వేలానికి అందుబాటులో ఉన్న ముగ్గురు ఆట‌గాళ్ల నుంచి ముగ్గురినీ తీసుకోనున్నాయి.

ఈ ప్ర‌క్రియ ముగిసిన త‌రువాత జ‌న‌వ‌రి తొలివారంలో మెగావేలం నిర్వ‌హించాల‌ని భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి భావిస్తోంది. ఈసారి జ‌ట్ల సంఖ్య 10కి చేర‌డంతో అద‌నంగా 44 మందికి అవ‌కాశం ద‌క్క‌నుంది. ముఖ్యంగా వెస్టిండిస్ విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ కు ఈసారి నిరాశ త‌ప్పేలా లేదు. పేల‌వ ఫామ్ దృష్ట్యా ప్రాంచైజీలు ఈ యూనివ‌ర్స్ బాస్‌పై పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌చ్చు. విండిస్ వీరుడికి ఈసారి అన్‌సోల్డ్ లిస్ట్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానం ద‌క్క‌నుంది. టీమిండియాకు చెందిన చ‌టేశ్వ‌ర్ పుజారా, హ‌నుమ విహారి, ఆస్ట్రేలియాకు చెందిన డానియ‌ల్ క్రిస్టియ‌న్‌, అరోన్ పింఛ్‌లు కూడా అన్‌సోల్డ్ లిస్ట్‌లోనే నిలువ‌నున్నారు.

 

Visitors Are Also Reading