సాధారణంగా ఎవ్వరైనా ప్రియుడు లేదా ప్రియురాలు ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ నాలుగు రాశుల వారు మాత్రం ప్రియుడు లేదా ప్రియురాలితో వేరే వారిలాగా వ్యవహరిస్తుంటారు. వీరిలో ఆత్మగౌరవం, ఆత్మాభిమానం తక్కువగానే ఉంటుంది. తమకు తాము ఎక్కువగా గౌరవం ఇచ్చుకోకుండా తమను ఎవ్వరూ ప్రేమిస్తారులే అనే నమ్మకంతో ఉంటారు. ఎవ్వరూ తమను ప్రేమించరు అని భావించి వీరు ముఖం చూపించాల్సిన అవసరం లేని ఆన్‌లైన్ ప్రపంచంలో ప్రేమను పొందాలనుకుంటారు. వీరికి తక్కువ ఆత్మగౌరవం ఉంటుంది. ఐడెంటిటీని బయటపెట్టకుండా వేరే వ్యక్తి మాదిరిగా అందరితో చాట్ చేస్తుంటారు. అట్రాక్ట్ చేసేందుకు వీరు తమ అసలైన గుర్తింపును దాస్తారు. ఏయే రాశుల వారు ఇలా వ్యవహరిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కర్కాటక రాశి :
Advertisement
ఈ రాశి గల వ్యక్తల యొక్క మూడ్ వెంటనే చేంజ్ అవుతుంది. వీరు ఎప్పుడు ఎలా ఉంటారో అంచనా వేయడం కష్టం. వీరు చాలా సందర్భాల్లో బాధగా ఉంటారు. పాఠశాలల్లో చదువుతున్న రోజుల్లో వీరిని ఇతర స్టూడెంట్స్ ఎక్కువగా ఏడిపిస్తుంటారు. అందువల్ల వారు తమ బాల్యాన్ని ఎక్కువ భాగం తక్కువ ఆత్మ గౌరవంతోనే జీవితాన్ని సాగిస్తారు. ఆన్‌లైన్‌లో మరొకరి గుర్తింపుతో తప్పుడు ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి తెలిసిన, తెలియని వారందరితో మాట్లాడుతుంటారు. వేరే వ్యక్తి మాదిరిగా వీరు చేసే పని చట్టవిరుద్ధంగా కూడా కనిపించవచ్చు.
మకర రాశి :
Advertisement
మకర రాశి గల వ్యక్తులు దురుద్దేశంతో క్యాట్ ఫిష్ చేస్తారు. ఇతరులను బాధ పెట్టడానికి లేదా అవమానించడానికి వీరు వేరే ప్రొఫైల్స్ తో చాట్ చేయడం ప్రారంభించారు. వాస్తవానికి మకరరాశి వారిలో ఓర్పు ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరైనా వారిని జీవితంలో తక్కువ చేసినప్పుడు హానికరమైన మార్గాల్లో సమాధానం చెప్పాలని కోరుకుంటాను. తమ శత్రువులను నేరుగా ఎదుర్కునేందుకు వీరు ధైర్యం చేయలేరు. బదులుగా తమ శత్రువులను ఇబ్బంది పెట్టడానికి క్యాట్‌ఫిష్ చేసే కీ బోర్డు యోధులుగా మారుతారు.
కుంభరాశి :
చాలా మంది కుంభ రాశి వ్యక్తులు బయటి ప్రపంచంలో అడుగుపెట్టి ధైర్యంగా మాట్లాడుతుంటారు. కానీ కొందరూ మాత్రం చాలా సిగ్గుపడుతుంటారు. రియల్ వరల్డ్ లో ధైర్యంగా అన్ని మాట్లాడాలని అనుకుంటారు. వారికి ధైర్యం చాలదు. ఇలాంటి వ్యక్తులు పలు పేర్లతో ఆన్‌లైన్ ప్రొఫైల్ లను సృష్టించి వారి జీవితంలో తమకు తెలిసిన వ్యక్తులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. క్యాట్ ఫిషింగ్ చేస్తున్నారని అవతలి వ్యక్తికి తెలిస్తే చాలా బాధపడే అవకాశముంది. వీరు వేరే పేరుతో సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి తెలిసిన వారితో చాట్ చేస్తుంటారు.
మీనరాశి :
మీన రాశి వారు తమకు తెలిసిన అపోజిట్ వారితో మాట్లాడే ధైర్యం లేనప్పుడు వీరు కూడా క్యాట్ ఫిషింగ్‌కు పాల్పడుతుంటారు. వేరే వ్యక్తి మాదిరిగా ప్రొఫైల్ క్రియేట్ చేసి చాట్ చేస్తారు. ఇలా ఫేక్ ఐడెంటిటితో మాట్లాడడం వారిలో ఓ అపరాధ భావాన్ని కలిగిస్తుంది. ఫలితంగా వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి