Telugu News » Blog » ఈ రాశుల‌ వారు ప్రేమించినంత ఈజీగా బ్రేక‌ప్ చేస్తారు..!

ఈ రాశుల‌ వారు ప్రేమించినంత ఈజీగా బ్రేక‌ప్ చేస్తారు..!

by Anji
Ads

ప్ర‌తి ఒక్క‌రూ ప్రేమ అనే అనుభూతిని పొందాల‌నుకుంటారు. ఈ ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎక్క‌డ పుడుతుందో అస‌లు చెప్ప‌లేం. ప్రేమ పుట్టుక‌కు కార‌ణం ఉండ‌క‌పోవ‌చ్చు. కొన్నిసార్లు చిన్న కార‌ణాలు ప్రేమ విచ్ఛిన్నం కావ‌డానికి తోడ్ప‌డుతాయి. కొంత‌మంది మాత్రం ఒక్క‌సారి ప్రేమ‌లో ప‌డితే జీవితాంతం వారితోనే క‌లిసి ఉండాలనుకుంటారు. మ‌రికొంత మంది ఆ బంధంలో ఎక్కువ కాలం ఉండ‌లేరు. సుల‌భంగా బ్రేక‌ప్ చెప్పేస్తారు. అంతేకాదు ఎదుటివారు ఎంత ఇబ్బంది ప‌డుతారో గుర్తించ‌లేరు. బ్రేక‌ప్ చెప్పి తాము మూవ్ ఆన్ అయిపోవాల‌ని భావిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం.. కొన్ని రాశుల వారు అంద‌రి మాదిరిగా ప్రేమ‌లో ప‌డి సుల‌భంగా బ్రేక‌ప్ చేబుతారు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభం

ఈ రాశి వారు కూడా స్వ‌తంత్రంగా ఉండాల‌ని భావిస్తారు. వీలైనంత వ‌ర‌కు ఈ రాశి వారు త‌మ‌కు అంటూ ఓ ప్ర‌పంచాన్ని సృష్టించుకుంటారు. అందులో ఉండాల‌ని భావిస్తుంటారు. ప్రేమ‌, బంధాల‌ను కూడా దూరం చేసుకుంటారు. స్నేహాలు, బంధాలు, బందుత్వాలు ఇవేమీ వీరికి ఆనందాన్ని ఇవ్వ‌వు. సేవా కార్యక్ర‌మాలు, విరాళాలు ఇవ్వ‌డం, దానాలు లాంటివి ఎక్కువ‌గా చేస్తారు. ఈ కార‌ణంగా ప్రేమ బంధాల్లో ఇరుక్కోవ‌డం వీరికి ఇష్టం ఉండ‌దు. అందుకే ప్రేమ‌కు సుల‌భంగా బ్రేక‌ప్ చెబుతారు.

ధ‌న‌స్సు

ఈ రాశి వారికి కొంచెం ధైర్యం ఎక్కువ‌. స్వ‌తంత్రంగా ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌త‌రు. స్వ‌యంగా ప్రేరేపితుల‌వుతారు. అడ్వెంచ‌ర్ల‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. ఇందుకోసం ర‌క‌ర‌కాల ప్రదేశాల‌కు ప్ర‌యాణాలు చేస్తుంటారు. వీరు సంబంధాలు, ప్రేమ‌, బాధ్య‌త‌లు లాంటి వాటికి పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌రు. ఓ బంధాన్ని ఏర్పరుచుకొని ఒకేచోటు ఉండిపోవ‌డం వీరికి ఇష్టం ఉండ‌దు. కొంత‌కాలం పాటు ప్రేమ బంధాన్ని కొన‌సాగించి అనంత‌రం బ్రేక‌ప్ చెబుతారు. బంధం నుండి బ‌య‌ట‌ప‌డిన త‌రువాత ఎదుటివారు ఎంత బాధ‌ప‌డినా ఉప‌యోగం ఉండ‌దు. వీరు సుల‌భంగా మూవ్ ఆన్ అవుతారు.

సింహం

ఈ రాశి వారు అంద‌రూ త‌మ‌నే చూడాల‌ని భావిస్తారు. ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని.. సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్ గా నిల‌వాల‌ని అనుకుంటారు. పొగ‌డ్త‌లు, ప్రేమ‌, కోరిక‌లు ఇవ‌న్నీ కోరుకుంటారు. వీళ్లు ఎవ‌రైనా ప్రేమిస్తే.. పెళ్లి చేసుకుంటే వారి నుంచి ఇవ‌న్ని కోరుకుంటారు. కోపంలో వాద‌న‌లు జ‌రిగి సింహ‌రాశి వారికి ఏమైనా అంటే అంతే సంగ‌తి. మ‌రొకసారి ఆలోచించ‌కుండా ఆ బంధానికి బ్రేక‌ప్ చెబుతారు. త‌మ‌కు విలువైన వ్య‌క్తితో క‌లిసి ఉండ‌లేన‌ని కుండ‌బ‌ద్ధ‌లు చేసిన‌ట్టు మాట్లాడుతుంటారు. ఈ రాశి వారితో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఇవి కూడా చదవండి :

  1.  Tcs Jobs : టీసీఎస్‌లో మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు.. రెండు రోజులే ద‌ర‌ఖాస్తుకు గ‌డువు
  2. ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్ డిలీట్…జక్కన్న పై ఫ్యాన్స్ ఫైర్ …!

You may also like