కొంతమంది దర్శకుల సినిమాల్లో కనిపించిన నటీనటులు ఆ తరవాత సినిమాలో కనిపించడం కామన్. వాళ్ల నటన మరియు ఆటిట్యూడ్ నచ్చిందంటే మరో సినిమాలో కూడా అవకాశం ఇస్తారు. అయితే తమ డైరెక్షన్ లో వచ్చిన ఒకటి రెండు సినిమాలలో అవకాశం ఇవ్వడం కానీ తీసిన ప్రతి సినిమాలో అవకాశం ఇవ్వడం అరుదుగా కనిపిస్తుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం తన ప్రతి సినిమాలోనూ ఓ నటుడికి అవకాశం ఇస్తాడు.
Advertisement
ALSO READ : Ravanasura Trailer : అదరగొట్టిన మాస్ మహారాజ్..గత్తర్ లేపిన “రావణాసుర” ట్రైలర్
ఆ నటుడి పేరు పమ్మి సై…అయితే ఈ పేరు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ త్రివిక్రమ్ సినిమాలో ఈయనకు ఖచ్చితంగా చిన్న కామిక్ రోల్ ఉంటుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమాలో పమ్మి సై నటించాడు. ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ హోటల్ లో టిఫిన్ చేస్తున్న సమయంలో పమ్మి సై సర్వర్ గా కనిపిస్తాడు.
Advertisement
అదేవిధంగా పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాలో కూడా పమ్మి సై నటించాడు. ఈ సినిమాలో కూడా వెయిటర్ గానే నటించాడు. తివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన జల్సా సినిమాలో పమ్మి సై డ్రైవర్ పాత్రలో కనిపించాడు.
మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా సినిమాలో కూడా పమ్మి ఓ చిన్న రోల్ చేశాడు. అలాగే అరవింద సమేత, అజ్నాతవాసి, అఆ మరియు రీసెంట్ గా వచ్చిన సార్ సినిమాలో కూడా పమ్మి సై నటించాడు. ఇక త్రివిక్రమ్ కు పమ్మి సై సన్నిహితుడు కావడం ఆయన నటన నచ్చడంతోనే ప్రతి సినిమాలోనూ తప్పుకుండా ఛాన్స్ ఇస్తున్నారు.
Advertisement
ALSO READ : Nidhhi Agerwal – Venu Swamy: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. ఇదిగో వీడియో!