సినిమా హిట్ అవ్వడానికి ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేయడానికి కొంత మంది నటులు ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారు. అలాంటిదే ఈ గుర్రపు స్వారీ! చరిత్రకు సంబంధించిన సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించే నటీనటులు ప్రత్యేకంగా గుర్రపు స్వారీని నేర్చుకొని మరీ నటించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!
1) బాలకృష్ణ- గౌతమీ పుత్ర శాతాకర్ణి:
క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కోసం బాలకృష్ణ హార్స్ రైడింగ్ లో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నాడు.
Advertisement
2) ప్రభాస్ & తమన్నా – బాహుబలి:
బాహుబలి సినిమా కోసం ప్రభాస్ కొన్ని రోజుల పాటు కత్తిసాము, గుర్రపు స్వారీల్లో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక అవంతికగా నటించిన తమన్నా కూడా హార్స్ రైడింగ్ లో ట్రైనింగ్ తీసుకుంది.
3) చిరంజీవి – కొండవీటి దొంగ
సినిమా కోసం గుర్రపుస్వారీ శిక్షణ తీసుకున్న ఫస్ట్ హీరో చిరంజీవి. కొండవీటి దొంగ, కొదమ సింహాంల్లాంటి సినిమాల్లో చిరంజీవి గుర్రపు స్వారీ సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. చిరంజీవికి సొంత గుర్రం కూడా ఉంది.
Advertisement
4) రామ్ చరణ్ – మగధీర:
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాకోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా గుర్రపుస్వారీలో శిక్షణ తీసుకున్నాడు.
5) అల్లు అర్జున్ – బధ్రీనాథ్ , రుద్రమదేవి
రుద్రమదేవి సినిమా కోసం బన్నీ 2 నెలల పాటు ప్రత్యేకంగా హార్స్ రైడింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. అందుకే గోన గన్నారెడ్డి పాత్ర అంత అద్భుతంగా వచ్చింది.
6) అనుష్క – రుద్రమదేవి:
అనుష్క కూడా రుద్రమదేవి సినిమా కోసం 2 నెలలు హార్స్ రైడింగ్ నేర్చుకుంది. మొదట అనుష్కకు గుర్రాలంటే విపరీతమైన భయం ఉండేదట., రుద్రమదేవి పాత్ర కోసం భయపడుతూనే హార్స్ రైడింగ్ నేర్చుకుందట స్వీటి!
7) మహేష్ – టక్కరిదొంగ
టక్కరి దొంగ సినిమాకోసం మహేష్ బాబు 2 వారాలు ప్రత్యేకంగా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నాడు.