Telugu News » Blog » పెద్ద పేగు క్యాన్సర్ కి ఈ లక్షణాలు సంకేతం కావచ్చు.. వాటిని ఎలా గుర్తించాలంటే..?

పెద్ద పేగు క్యాన్సర్ కి ఈ లక్షణాలు సంకేతం కావచ్చు.. వాటిని ఎలా గుర్తించాలంటే..?

by Anji

సాధారణంగా చాలా మంది ఎన్నో రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం ఉన్న కాలంలో జీవించే విధానంలో మార్పుల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు ఎక్కువగా వేధిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సహజ క్యాన్సర్లలో ప్రేగు క్యాన్సర్ కూడా ఒకటి. ఇది కడుపులోని పెద్ద ప్రేగులకు సోకుతుంది. దీనిని మల క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. క్యాన్సర్ తొలి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. 

Advertisement

 వైద్యులు ఆ ప్రమాదంలో ఉన్నా లేకపోయినా.. 50 సంవత్సరాలు దాటిన మనుషుల కోసం స్క్రీనింగ్ ని సిఫారసు చేస్తున్నారు. సంకేతాలు కనిపించినప్పుడు అవి ఒక్కొక్కటిగా మారుతుంటాయి. పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్ లక్షణాలు మలబద్ధకం, అతిసారం, విసర్జనలో ఇబ్బందులు, టాయిలెట్ వాడే ఫ్రీక్వెన్సీ లో మార్పు, మూత్రంలో రక్తం కనిపించడం, ఆకలి వేయకపోవడం, కొంచెం తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనుక మీకు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.  ముఖ్యంగా స్త్రీల కంటే పురుషుల్లోనే ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.   

Advertisement

Also Read :  కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబు, వంటలక్క ఎంత సంపాదించారో తెలుసా ?

Manam News

పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చిన వారిలో ఎడమవైపు వచ్చిన వారికి కుడివైపునకు వస్తే వారికి ఎడం వైపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్థూలకాయం ఉండడం, పీచు పదార్థాలు లేని జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఆల్కహాల్ తీసుకోవడం వంటివి పెద్ద ప్రేగు క్యాన్సర్ ముఖ్యకారణం అవుతుంది. గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇటువంటి సమస్యలుంటే ఆలస్యం చేయకుండా కొలానోస్టోపీ చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెద్ద పేగు గోడ లోపల పరిమితమైనటువంటి క్యాన్సర్లు చికిత్సతో తగ్గించుకోవచ్చు. అది ముదిరిన తరువాత ఏ ట్రీట్ మెంట్ చేసిన అస్సలు తగ్గదు కాబట్టి జాగ్రత్తగా ఉండడం బెటర్.  

Also Read :  రాత్రిపూట ఈ ఆహారపదార్థాలను నానబెట్టి తింటే ఈ వ్యాధులన్నీ దూరం..!