Home » భారీ అంచ‌నాలతో సంక్రాంతికి విడుద‌లై అట్ట‌ర్ ఫ్లాప్ అయిన 10 సినిమాలు ఇవే..!

భారీ అంచ‌నాలతో సంక్రాంతికి విడుద‌లై అట్ట‌ర్ ఫ్లాప్ అయిన 10 సినిమాలు ఇవే..!

by AJAY
Published: Last Updated on
Ad

ప్ర‌తిఏడాది సంక్రాంతి వ‌చ్చిందంటే కొత్త సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి. అయితే అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మ‌రికొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. అలా టాలీవుడ్ లో భారీ అంచ‌నాల న‌డుమ సంక్రాంతికి విడుద‌లై ఫ్లాప్ అయిన ప‌ది సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…

Advertisement

చిరంజీవి హీరోగా 2001 సంక్రాంతి కానుక‌గా మృగ‌రాజు సినిమా విడుద‌లైంది. ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై ఫ్లాప్ అయ్యింది. 2002 సంక్రాంతికి ట‌క్క‌రిదొంగ సినిమా విడుద‌లైంది. ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఎన్టీఆర్ పూరీ జ‌గ‌న్నాత్ కాంబినేష‌న్ లో ఆంధ్రావాలా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుద‌లై అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది.

Advertisement

చిరు హీరోగా 2004లో భారీ అంచ‌నాలతో భారీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో తెరర‌కెక్కిన సినిమా అంజి ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ప్రభాస్ హీరోగా వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిన సినిమా యోగి ఈ సినిమా కూడా భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య న‌టించిన ఒక్క‌మ‌గాడు సినిమా కూడా సంక్రాంతికే విడుద‌లైంది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన నంబ‌ర్ 1 సినిమాను కూడా సంక్రాంతికే విడుద‌ల చేశారు.

2014లో భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరెకెక్కిన సినిమా అగ్నాత‌వాసి ఈసినిమా కూడా భారీ అంచ‌నాల‌తో 2018 సంక్రాంతికి విడుద‌లైంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా నటించిన విన‌య‌విదేయ రామ సినిమా 2019 సంక్రాంతికి విడుద‌లైంది. భారీ అంచ‌నా న‌డుమ వ‌చ్చిన ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది.

Also Read:  బాలీవుడ్ స్టార్ హీరోతో అల్లు అర్జున్ మల్టీస్టారర్ మూవీ.. దర్శకుడు ఎవరంటే..?

Visitors Are Also Reading